Take a fresh look at your lifestyle.

అట్టహాసంగా కొత్వాల్ కేసరి ప్రారంభం

0 44

తెలంగాణలో మొదటిసారి సిటీ సీపీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు
– ఈనెల 5 వరకు రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 20 23

హైదరాబాద్ : హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీ వరకు జరగనున్న కొత్వాల్ కేసరి కుస్తీ పోటీల ఛాంపియన్షిప్-2023 శుక్రవారం సాయంత్రం కుడా స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది.

దీన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఇప్పటికే తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పర్యవేక్షణలో దక్షిణ మండలం డిజిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో సిటీ కాలేజ్ సమీపంలోని కూడా స్టేడియంలో జరిగే ఈ రెజ్లింగ్ ఛాంపియన్షిప్- 2023 లో పాల్గొనడానికి అనుబం గల వస్తాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ప్రారంభోత్సవం సందర్భంగా ఐపీఎస్ అధికారులు శాంతికపోతాలను గాల్లో ఎగురవేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా నగర జాయింట్ పోలీస్ కమిషనర్ (ఎస్బి) విశ్వప్రసాద్ మాట్లాడుతూ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో దక్షిణ మండలానికి ప్రత్యేక స్థానం ఉన్నదని.. దేశంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దాని ప్రభావం పాతబస్తీ దక్షిణ మండలంలో ఉంటుందన్నారు.

మొదటిసారి తెలంగాణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నమన్నారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి వస్తాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మానసిక ప్రశాంతత..పరిపూర్ణమైన ఆరోగ్యంతో పాటు శరీర ధారుఢ్యం పెంచుతాయన్నారు.

దర్శన్ మండలం డిసిపి సాయి చైతన్య మాట్లాడుతూ.. కుస్తీ పోటీల్లో వివిధ విభాగాల్లోని విజేతలందరికీ రూ.8 లక్షల వరకు నగదు ఉంటుందన్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా హాజరైన వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. విజేతలకు నగదు తో పాటు మెరిట్ సర్టిఫికెట్, మెడల్ అందజేస్తామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నగర అదనపు సిపి (ట్రాఫిక్) సుధీర్ బాబు, డిఐజి (పి అండ్ ఎల్) రమేష్ రెడ్డి జాయింట్ సిపి (సిఐఆర్) ఎం శ్రీనివాస్, డిసిపి క్రైమ్ సబరీస్, దక్షిణ తూర్పు మండలం డిసిపి రూపేష్, దక్షిణం పశ్చిమ మండలం డిసిపి కిరణ్ కారే, నగర ట్రాఫిక్ డిసిపి-2 అశోక్, దక్షిణ మండల ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking