Take a fresh look at your lifestyle.

ఆమె పుట్టుక స్త్రీనే, ఒలింపిక్స్ కు వచ్చింది స్త్రీగానే.. మరి మగాడిగా ఎందుకు విమర్శలు వస్తున్నాయి?

ఇప్పుడు ఇదే అంశం పారిస్ ఒలింపిక్స్ ను కుదిపివేస్తోంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం దీనిపై స్పందించి మరింత హీట్ పెంచారు.

0 153

నిర్దేశం, పారిస్: ఇమాన్ ఖలీఫా.. పారిస్ ఒలింపిక్స్ లో అల్జీరియా దేశం నుంచి మహిళా బాక్సింగ్ లో పాల్గొన్న క్రీడాకారిణి. ప్రస్తుతం ఈమె చుట్టూ పెద్ద వివాదంకొనసాగుతోంది. ఇమానే పంచ్ లకు ఇటాలియన్ మహిళా బాక్సర్‌ 46 సెకన్లలో రింగ్ వదిలివేయడం. ఈ ఓటమికి కారణం ఏంటంటే, మ్యాచ్ ప్రారంభమైన 40 సెకన్లలోనే ప్రత్యర్థి బాక్సర్ మ్యాచ్‌లో పోరాడేందుకు నిరాకరించింది. కారణం, అల్జీరియా బాక్సర్ బయోలాజికల్ మేల్ అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే తాను ఈ మ్యాచ్ లో పాల్గొనలేనని తప్పుకోవాల్సి వచ్చింది.

ఇటలీకి చెందిన ఏంజెలా కారిని తన పోరాటం నుంచి నిష్క్రమించిన తర్వాత తన జీవితంలో ఇంత శక్తివంతమైన పంచ్‌ను ఎప్పుడూ ఎదుర్కోలేదని చెప్పింది. ఇమాన్ ఒక లింగమార్పిడి వ్యక్తి కావడంతో, తాను మగ బాక్సర్‌తో తలపడుతున్నట్లు అనిపించిందని ఏంజెలా పేర్కొంది. ఇప్పుడు ఇదే అంశం పారిస్ ఒలింపిక్స్ ను కుదిపివేస్తోంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం దీనిపై స్పందించి మరింత హీట్ పెంచారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సైతం దీనిని తప్పు పట్టడంతో ఈ వివాదం రాజకీయంగా కూడా కాకపుట్టిస్తోంది.

నిజానికి, ఇమాన్ ఖలీఫ్ ఒక అల్జీరియన్ బాక్సర్. ఆమె ఒక లింగమార్పిడి బాక్సర్. దీంతో ఆయా కేటగిరీల్లో అర్హత ప్రమాణాలకు అనుగుణంగా లేనందున 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల నుంచి తొలగించబడ్డారు. కానీ లింగ సమానత్వం ద్వారా పారిస్ ఒలింపిక్స్ 2024లో ప్రవేశం పొందింద. అలా అని ఖలీఫ్ ట్రాన్స్‌జెండర్ అథ్లెట్ కాదు. ఆమె ఆడగానే జన్మించింది. కానీ సెక్స్ డెవలప్‌మెంట్‌లో రుగ్మత కలిగి ఉంది. దీనివల్ల ఆమెకు మగవారిలాగే XY క్రోమోజోమ్‌లు, టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉన్నాయి. 25 ఏళ్ల ఇమాన్ ఖలీఫా అల్జీరియాలోని టియారెట్‌కు చెందినవారు.

బాక్సింగ్‌లో పాల్గొనాలనే ఆమె నిర్ణయానికి తండ్రి సానుకూలంగా లేడు. కానీ పెద్ద వేదికపై స్వర్ణం సాధించడం ద్వారా తరువాతి తరానికి స్ఫూర్తినివ్వడమే తన లక్ష్యంగా వచ్చింది. ఆమె 2018 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అరంగేట్రం చేసి 17వ స్థానంలో నిలిచింది. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె 19వ స్థానంలో నిలిచింది. టోక్యో ఒలింపిక్స్ 2021 క్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె ఐర్లాండ్‌కు చెందిన కెల్లీ హారింగ్టన్ చేతిలో ఓడిపోయింది. ఆమె 2022 ఆఫ్రికన్ ఛాంపియన్‌షిప్‌లు, 2023 అరబ్ గేమ్స్‌లో స్వర్ణం గెలుచుకున్నప్పుడు, మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో అమీ బ్రాడ్‌హర్స్ట్ చేతిలో ఓడిపోయింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking