Take a fresh look at your lifestyle.

జర్నలిస్టులపై అట్రాసిటీ కేసు చెల్లదు: హైకోర్టు

0 175

జర్నలిస్టులపై అట్రాసిటీ కేసు చెల్లదు: హైకోర్టు

హైదరాబాద్ : విధుల్లో ఉన్న జర్నలిస్టుకి ఎదుటివారు ఏ సామాజిక వర్గమో ఎలా తెలుస్తుంది?” అని హైకోర్టు ప్రశ్నించింది. ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా నమోదు చేస్తారని పోలీసులను నిలదీసింది. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటే ఫిర్యాది దారు ఏ సామాజికవర్గానికి చెందినవారో నిందితులకు తెలిసి ఉండాలని, కానీ ప్రస్తుత కేసులో ఫిర్యాదుదారు కులం గురించి విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు తెలియదని అభిప్రాయపడింది.

అందువల్ల జర్నలిస్టులపై ఎస్సీ, ఎస్టీ కేసు చెల్లదని స్పష్టం చేసింది. తమపై ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్ 3(2)(ఎ) కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఇద్దరు జర్నలిస్టులు హైకోర్టును ఆశ్రయించగా, మంగళవారం ఈ పిటిషన్పై జస్టిస్ ఎం. మాన వేంద్రనాథ్ రాయ్ విచారణ జరిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking