రెండు రోజులపాటు రేవంత్ ఢిల్లీ పర్యటన
హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజులపాటు ఢీల్లీలోనే వుంటారు. ఆదివారం నాడు చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ.రంజిత్ రెడ్డి,రాజేందర్ నగర్ ఎమ్మెల్యే,తొలకంటి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరనున్నారు. మాజీ మంత్రి ఇ, పెద్దిరెడ్డి,భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి కూడా రేపు పార్టీలో చేరతారంటూ ప్రచారం కొనసాగుతోంది.
సోమవారం నాడు సెంట్రల్ ఎలక్షన్ మీటింగ్ కు రేవంత్ హాజరు అవుతారు. మూడో జాబితాలో తెలంగాణ నుండి తొమ్మిది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం వుంది. ఖమ్మం, మల్కాజ్ గిరి, భువనగిరి,సికింద్రాబాద్ స్థానాలు పెండింగ్ వుంచారు.,