Take a fresh look at your lifestyle.

ఆర్టీసీ కళాభవన్ లో అంబేద్కర్ జయంత్యోత్సవాలు

0 66

హైదరాబాద్ టీఎస్ ఆర్టీసీ కళాభవన్ లో

ఘనంగా అంబేద్కర్ జయంత్యోత్సవాలు

హైదరాబాద్, ఏప్రిల్ 14 :  భారత రాజ్యాంగ నిర్మాత‌గా దేశ గ‌మ‌నాన్ని మార్చ‌డంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్క‌ర్ పోషించిన‌ పాత్ర ఎనలేనిదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) చైర్మన్, శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు కొనియాడారు.  బలహీన వర్గాలకు చిరస్థాయిలో నిలిచిపోయే వ్యక్తి అంబేడ్కర్ అని,  ఆయన ఆశయాలు తరతరాలకు స్ఫూర్తి అని కీర్తించారు.


టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ అంబేద్కర్ జయంత్యోత్సవాలు హైదరాబాద్ లోని కళా భవన్ లో శుక్రవారం ఘనంగా జరిగాయి.  ఈ కార్యక్రమానికి సంస్థ చైర్మన్, శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం టీఎస్ఆర్టీసీ చైర్మన్, శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్దన్ గారు మాట్లాడుతూ.. అంబేద్కర్ సామాన్య కుటుంబంలో జన్మించి అసమాన్య వ్యక్తిగా ఎదిగారని, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించడం మన అందరికీ గర్వకారణమన్నారు.

సంస్థ ఎండీ సజ్జనర్ గారితో కలిసి ఉద్యోగుల సంక్షేమానికి ప్రాముఖ్యత ఇస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. ఇప్పటికే ఆరు డీఏలను మంజూరు చేశామని గుర్తు చేశారు.  అంబేడ్కర్ బాటలో పయనించి సంస్థను లాభాల్లోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్క సిబ్బంది పాటుపడాలని పిలుపునిచ్చారు. సమిష్టిగా పని చేసి సంస్థను ముందుకు తీసుకుపోదామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈడీ మునిశేఖర్, సీపీఎం కృష్ణకాంత్, సీటీఎం కృష్ణకాంత్, సీఈఐటీ రాజశేఖర్, సీఎఫ్ఎం విజయ పుష్ప, తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking