Take a fresh look at your lifestyle.

Relationship Tips: చీట్ చేయడంలో అమ్మాయిలు తోపులు.. వారిని గుర్తుపట్టేందుకు 3 టిప్స్

మీ గర్ల్ ఫ్రెండ్ మీతో భవిష్యత్తు గురించి మాట్లాడటానికి సంకోచించినట్లయితే, మీరు మీ రిలేషన్షిప్ గురించి మరోసారి ఆలోచించాల్సిందే.

0 64

నిర్దేశం, హైదరాబాద్: సాధారణంగా గర్ల్‌ఫ్రెండ్‌, బాయ్‌ఫ్రెండ్‌ల మధ్య గొడవలు జరిగితే అది అబ్బాయి తప్పేనని అనుకుంటారు చాలా మంది. కానీ, అమ్మాయిల వల్ల కూడా చాలా గొడవలు తలెత్తుతాయి. వాస్తవానికి రిషలేషన్షిప్ లో అమ్మాయిలు చాలా నిజాయితీగా ఉంటారు. కానీ ఇంట్లో బలవంతం చేయడం వల్లనో మరే ఇతర కారణం వల్లనో వారు ఒక రిషలేషన్షిప్ లోకి ప్రవేశిస్తే మాత్రం ఇబ్బందులు తలెత్తుతాయి. ఒకవేళ మీ జీవితంలో ఇలాంటి జరిగితే వెంటనే దాన్నుంచి బయటపడండి. ఇలాంటి రిషలేషన్షిప్ గుర్తించేందుకు 3 టిప్స్ మీకు చెప్తున్నాం.

సౌలభ్యం ప్రకారం మాట్లాడటం
మీ గర్ల్‌ఫ్రెండ్‌ మిమ్మల్ని అవసరానికి ఉపయోగించుకుంటే, ఆమె తన సౌలభ్యం ప్రకారం మీతో మాట్లాడుతుంది. ఆమెకు ఖాళీ సమయం దొరికినప్పుడు లేదా తనకు నచ్చినప్పుడు మాత్రమే ఆమె మీతో మాట్లాడుతుంది. మీతో బయటకు వచ్చేందుకు, మిమ్మల్ని కలవడానికి ఆమె పదే పదే సాకులు చెబుతుంది. ఆమె మీతో మానసికంగా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించదు. మీకు మానసికంగా దూరంగా ఉండేందుకే ఈ సాకులు.

తనకు మాత్రమే ప్రాముఖ్యత
ఇద్దరి వ్యక్తుల ఇష్టాలు, అయిష్టాలు, కోరికలు, ఆలోచనలు, అవసరాలను ప్రతిబింబించినప్పుడే రిలేషన్షిప్ బలంగా మారుతుంది. కానీ ఒక అమ్మాయి తన గురించి మాత్రమే మాట్లాడుతుందంటే, మీరు ఔట్ అని అర్థం చేసుకోవాలి. ఆ రిలేషన్ఫిప్ లో మీకు ఎలాంటి ప్రాధాన్యం ఉండదు.

భవిష్యత్తు ప్లాన్ లేదు
ఇద్దరు వ్యక్తులు రిలేషన్‌షిప్‌లోకి వచ్చినప్పుడు, చాలా మంది జంటలు తమ బంధం చాలా కాలం పాటు ఉంటుందనే అనుకుంటారు. ఇందుకోసం చిన్న చిన్న విషయాలపై భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. కానీ మీ గర్ల్ ఫ్రెండ్ మీతో భవిష్యత్తు గురించి మాట్లాడటానికి సంకోచించినట్లయితే, మీరు మీ రిలేషన్షిప్ గురించి మరోసారి ఆలోచించాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.

Breaking