Take a fresh look at your lifestyle.

సంక్రాంతి జరుపుకోని ఆదివాసీయులు

0 65

సంక్రాంతి జరుపుకోని ఆదివాసీయులు

విత్తనాల పండుగనే సంక్రాంతిగా కొనసాగించడం అసలు కధ ఇదే

సంస్కృతి,సంప్రదాయాలు,సనాతన ఆచారాలకు పట్టు గొమ్మలు గిరిజన పల్లెలు. మన్యంలో జరిగే ప్రతీ పండుగకూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో విత్తనాల పండుగ సందడి నెలకొంది.సంక్రాంతిని జరుపుకొని గిరిజనులు ఈ విత్తనాల పండుగనే సంక్రాంతిగా కొనసాగించడం ఈ గిరిజనుల అనాదిగా వస్తున్న సాం ప్రదాయం.విత్తనాల పండుగలో సంకు దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించ డం అరుదైన ఘట్టం.

అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని మన్యం వాసుల కు మాత్రం సంక్రాంతి సందడి విత్తనాల పండుగలో కనిపిస్తుంది. ఈ ఏజెన్సీ ప్రాంతంలోని పివిటిజి తెగ ఆదివాసీల్లో వింత వింత ఆచారాలు ఉంటాయి.ఒక ఆచారమే సంక్రాంతిని పుష్యమాసంలో జరుపుకోవడం.

వ్యవసాయదారులు ఎలా అయితే తమ పంట చేతికి వచ్చే సమయంలో మకర సంక్రాంతి పండ గని జరుపుకుంటారో అలానే మన్యం వాసులు తమ పంట చేతికందే సమ యంలో ఈ విత్తనాల పండుగ’ను జరుపుకుంటారు. తాము పండించిన పంటల్లో చోడిరాగులు, రాజ్మా, సామ లు, ధాన్యం నాలుగు రకాలతో ప్రతి ఇంటి నుంచి కొద్దికొద్దిగా సేకరించి కొంత భాగం నైవేద్యంగా సంకుదేవునికి సమర్పించి,

మరో సగం శంకు దేవుని సన్నిధిలో విత్తనాలు ఉంచి నాలుగు రోజులపాటు పూజలు నిర్వహిస్తారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గిరిజనులకు పోడు వ్యవసాయమే జీవనాధారం. అలా పండించిన పంటల సాయంతోనే వారు జీవనం సాగిస్తుంటారు.ఈ వ్యవసాయం సక్రమంగా సాగి, పంట చేతికి రావడానికి వారు వనదేవతలను ఆరాధించడం సంప్రదాయం.

ఇందులో భాగంగా సంకుదేవునికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహి స్తుంటారు.ప్రతీ ఏటా ఫిబ్రవరి 15వ తేదీలోగా ఈ పండుగను నిర్వహించు కోవడం వీరి ఆనవాయితీగా కొనసా గిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking