Take a fresh look at your lifestyle.

యాక్సిడెంట్‌ ఫ్రీగా టీఎస్‌ఆర్టీసీ !

0 261

యాక్సిడెంట్‌ ఫ్రీగా టీఎస్‌ఆర్టీసీ !

రోడ్డు ప్రమాదాల నివారణకు సిబ్బంది పాటు పడాలి

టీఎస్‌ఆర్టీసీ వీసీ అండ్‌ ఎండీ సజ్జనర్‌ సూచన

రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ సిబ్బందికి టాక్ట్‌ శిక్షణ ప్రారంభం

హైదరాబాద్, మార్చి 27 : త్వరలోనే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) యాక్సిడెంట్‌ ఫ్రీ కార్పొరేషన్‌గా మారబోతుందని సంస్థ వీసీ అండ్‌ ఎండీ శ్రీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్క సిబ్బంది పాటుపాడాలని ఆయన సూచించారు.

హైదరాబాద్‌లోని జేబీఎస్‌ ప్రాంగణంలో సోమవారం టీఎస్‌ఆర్టీసీ ఏప్రిల్‌ ఛాలెంజ్‌ ఫర్‌ ట్రైనింగ్‌ (టాక్ట్) శిక్షణను ఆయన ప్రారంభించారు. శిక్ష‌ణ‌లో పాల్గొన్న రంగారెడ్డి రీజియ‌న్ శిక్షకులను ఉద్దేశించి సజ్జనర్‌ మాట్లాడారు. టాక్ట్‌లో భాగంగా ఏప్రిల్‌ నెలలో సంస్థలోని డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్‌, తదితర విభాగాల సిబ్బంది అందరికీ శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.

ప్రయాణికులకు మెరుగైన సేవలతో పాటు సంస్థ అభ్యున్నతి దిశగా ప్రయత్నించడంలో సిబ్బంది అనుసరించాల్సిన అంశాలను వివరించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రస్తుతం టీఎస్‌ఆర్టీసీ రోడ్డు ప్రమాదాల రేటు ప్రతి లక్ష కిలోమీటర్లకు 0.07 శాతంగా ఉందని, ఇది భారత దేశంలోనే ప్రజా రవాణా సంస్థలలో అతి తక్కువగా నమోదై ఉండటం మంచి పరిణామంగా భావించవ్చని చెబుతూ, మరింత రోడ్డు భద్రతా నిబంధనల్ని పాటిస్తూ ప్రమాదాల రేటును జీరో స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.

”టాక్ట్‌ అంటే క్లిష్ట పరిస్థితుల్లో మంచి యుక్తి అని అర్థం. సంస్థ ఉన్న ఛాలెంజింగ్‌ పరిస్థితుల్లో సిబ్బందికి నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు ఒక వ్యూహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవ‌డం జ‌రుగుతోంది. ఈ శిక్షణ ద్వారా సిబ్బంది మెరుగైన ఫలితాలు తీసుకువస్తారనే నమ్మకం నాకు ఉంది.” అని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌ అన్నారు. సిబ్బందిలో మరింత మంచి మార్పును తీసుకురావడానికి ఈ నైపుణ్యాభివృద్ధి వంటి శిక్షణ ఎంతో దోహ‌దం చేయ‌నుంద‌న్నారు.

డ్రైవర్లకు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలపైనే కాకుండా సూపర్ వైజర్స్, అధికారులకు కూడా సంస్థ కార్యకలాపాల నిర్వహణలో చురుకుదనాన్ని, వేగవంతాన్ని పెంచడానికి సుశిక్షకులతో ఈ బోధన తరగతులును నిర్వహిస్తూ మంచి మార్పును తీసుకు రావడం జ‌రుగుతుంద‌న్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రముఖ సంస్థ చోళమండలం ఎంఎస్‌ రిస్క్‌ సర్వీసెస్‌ సహకారం తీసుకుంటున్నామని, వారు డ్రైవర్లకు నాణ్యమైన శిక్షణ అందిస్తున్నారని చెప్పారు. చిన్న చిన్న తప్పిదాలే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయని, ఈ శిక్షణ ద్వారా ప్రమాదాలు పూర్తిస్థాయిలో తగ్గుతాయన్నారు.

అనంత‌రం ప్ర‌యాణీకుల సౌక‌ర్యార్థం జె.బి.ఎస్‌లో పుష్ఫ‌క్ ఎయిర్‌పోర్ట్ బ‌స్ కంట్రోల్‌ పాయింట్‌ను ఆయ‌న‌ ప్రారంభించారు.

ఈ కార్యకమ్రంలో సంస్థ సీవోవో రవిందర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ పాటిల్‌, చోళమండలం ఎంఎస్‌ రిస్క్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుబ్బారావు, ఒ.ఎస్‌.డి (ఐ, టి అండ్ డి) యుగంధ‌ర్, ఈడీ (జి.హెచ్‌.జ‌డ్‌) యాదగిరి, సీపీఎం కృష్ణకాంత్‌, ఆర్‌ఎం వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking