Take a fresh look at your lifestyle.

ఆమ్ ఆద్మీ పార్టీకి సొంత సర్కారు నోటీసులు

0 191

ఔను మీరు చదువుతున్నది నిజమే.

ఢిల్లీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీస్ లు ఇచ్చింది.

నిజాయితీగా పాలన చేయాల్సిన సీఎం అరవింద్ కేజ్రివల్ పార్టీ ప్రసారానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆ నోటీస్ లో పేర్కొంది.

వడ్డితో కలిపి 164 కోట్లు తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని ఆదేశించింది.

స్వంత ప్రభుత్వం పార్టీకి నోటీస్ లు ఇవ్వడం ఏమిటనుకుంటున్నారా..?

అయితే… రాజకీయం అంటె ఇదెనెమో..

ప్రభుత్వ ప్రకటనల పేరుతో ఆమ్ ఆద్మీ పార్టీ సొంత ప్రచారం చేసుకుందనే ఆరోపణలపై ఢిల్లీ రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ (డీఐపీ) తాజాగా స్పందించింది. 

గతేడాది ప్రకటనలకు వెచ్చించిన సొమ్ముతో పాటు పెనాల్టీ మొత్తంతో కలిపి దాదాపుగా రూ.164 కోట్లు కట్టాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి నోటీసులు జారీ చేసింది.

ఈ మొత్తాన్ని పది రోజుల్లోగా ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సూచించింది. గడువులోగా కట్టకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆరోపించారు.

ప్రభుత్వ ప్రకటనలను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకుంటోందని ఇందుకోసం గతేడాది రూ.97 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమచేయాలని ఎల్జీ నోటీసులు ఇచ్చారు. అయితే, ఈ నోటీసులను ఆమ్ ఆద్మీ పార్టీ పట్టించుకోక పోవడం కొస మెరుపు.

రాజకీయంలో ఏదైనా జరుగచ్చు… ఎన్నైనా వింతలు చూడచ్చు…

 

Leave A Reply

Your email address will not be published.

Breaking