Take a fresh look at your lifestyle.

ఓ రిపోర్టర్ ఆవేదన

0 84

ఓ రిపోర్టర్ ఆవేదన
‘రిపోర్టర్’ ఈ పేరు వినగానే వాడికేంది మస్తు డబ్బులు సంపాదిస్తాడు అనే పేరు. విలేకరి నని బెదిరిస్తే డబ్బులు వస్తాయనుకుంటారు. కానీ.. ఆ రిపోర్టర్ ఆర్థిక సమస్యలతో పడే బాధను మాత్రం ఎవ్వడు చూడరు. న్యూస్ ఛానెల్స్.. డైలీ పేపర్ లు ఎమర్జెన్సీ పేరుతో వెట్టి శాకిరి చేయించుకుంటాయని చాలా మందికి తెలియని నిజం.
రిపోర్టర్.. పేరుకే రిపోర్టర్ అతను చేసే పనులన్నీ ఇతర పనులే.. యాడ్స్ చేయాలి.. సర్క్యూలేషన్ చేయాలి. పేపర్ లేదా న్యూస్ టీవీ ఛానల్స్ యజమానులకు ఏదైనా పని పడితే దగ్గర ఉండి పని చేయాల్సింది రిపోర్టర్ మాత్రమే.
స్టింగర్.. కంట్రిబ్యూటర్.. కరస్పాండెంట్.. రిపోర్టర్ ఇలా పేర్లు ఎన్ని ఉన్నా.. వాళ్లందరి బతుకులు మాత్రం కుక్కలు చింపిన ఇస్తారిలా ఉంటుంది.
ఒక్కసారి జర్నలిస్టుల బతుకుల్లోకి తొంగి చూసి వారికి ప్రభుత్వం నెల నెల పింఛన్ పథకం పెడితే బాగుంటుందెమో..
(కృష్ణాజిల్లా చల్లపల్లి చల్లపల్లి మండలం కేంద్రంలో జర్నలిస్ట్ కల్లేపల్లి చంద్ర ఆత్మహత్య)
– వయ్యామ్మెస్ ఉదయశ్రీ

Leave A Reply

Your email address will not be published.

Breaking