Take a fresh look at your lifestyle.

పన్నెండేళ్లకు చెప్పులు వేసుకున్న రైతు

0 16

పన్నెండేళ్లకు చెప్పులు వేసుకున్న రైతు

దేశానికి వెన్నెమూక రైతే రాజు అంటారు.. కానీ, ఆ రైతు మాత్రం పసుపు రైతుల కోసం దీక్ష చేపట్టాడు. ఒక్క రోజు.. రెండు రోజులు కాదు.. పన్నెండేళ్లుగా దీక్ష చేశాడు. ఇప్పుడు ఆ దీక్షను విరమించాడు.. అగో అతను పన్నెండేళ్ల దీక్ష ఎందుకు చేశాడు.. ఏమి చేశాడనే గదా.. పసుపు బోర్డు ఏర్పాటు చేసే వరకు చెప్పులు వేసుకోనాని శపథం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పసుపు బోర్డు ప్రకటనతో దీక్ష విరమించాడు ఆ రైతు..

నిర్దేశం, నిజామాబాద్ :

యావత్తు తెలంగాణ రైతాంగానికి పాలమూరు వేదికగా ప్రధాని మోడీ తీపి కబురు అందించారు.  అది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు దశాబ్దాలుగా ఉత్తర తెలంగాణ రైతులు ఎదురుచూస్తున్న తీపి కబురు… ఈ తీపి కబురు రాకముందు పసుపు బోర్డు ఏర్పాటు ఉద్యమంలా మారేలా ఆ రైతు కఠోర తపన దాగివుంది. బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలంలోని పాలెం రైతు ముత్యాల మనోహర్ రెడ్డి ఆ వ్యక్తి.  ఇప్పుడు మనోహర్ రెడ్డి చెప్పులు వేసుకునే టైం వచ్చింది.

పసుపు బోర్డు ఏర్పాటు అయ్యేవరకు చెప్పులు వేసుకోనని ప్రతిన బూనారు. ఉద్యమాలు చేస్తేనే పసుపు బోర్డు ఏర్పాటు అవుతుందని బిజెపి సీనియర్ నాయకుల్లో ఒకరైన మురళీధర్ రావు ప్రసంగాలతో స్ఫూర్తి పొందిన రైతు మనోహర్ రెడ్డి ఇప్పటి బిఆర్ఎస్ నాయకులు కొటపాటి నరసింహ నాయుడు తో కలిసి స్వదేశీ జాగరణ మంచు పేరిట పసుపు బోర్డు ఏర్పాటుకు బాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాలను చెప్పులు లేకుండా 2006లో పాదయాత్ర జరిపారు. అంతేకాకుండా ఈయన తన పాదయాత్రను జగిత్యాల్ జిల్లాతో పాటు తిరుపతి ఏడుకొండలకు చేరుకున్నారు.

ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా వేలాదిమంది పసుపు రైతులతో 2011లో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించి యావద్దేశాన్ని పసుపు ఉద్యమవైపు చెప్పగలిగారు. ఈయన గత 12 ఏళ్లుగా పసు బోర్డు కోసం చెప్పులు లేకుండా తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా ప్రకటనతో మనోహర్ రెడ్డి పలువురు అభినందిస్తున్నారు.

– టీ. నరేందర్, సీనియర్ జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking