Take a fresh look at your lifestyle.

ఫ్రెండ్ ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట

0 11

ప్రేమజంట ఆత్మహత్య

హైదరాబాద్, మే 16 : కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కె.పి.హెచ్.బి కాలనీ 7వ ఫేజులో ప్రేమికుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్నేహితుడి గదిలో ఉరి వేసుకొని శ్యాం, జ్యోతిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భీమవరం గొల్లవానితిప్పకు చెందిన ఇద్దరు కొద్ది రోజుల క్రితం స్నేహితుడి గదికి వచ్చారు. స్నేహితుడు వివాహం ఉంది అంటూ బయటకు వెళ్ళిన సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking