వంగూర్ మండలం చౌదరి పెళ్లిలో కీర్తిశేషులు అర్జున్ రెడ్డి గారి దశదిన కర్మ కు ఎంపీ రాములు గారు వచ్చి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అర్జున్ రెడ్డి గారు పార్టీ కొరకు కార్యకర్తగా పనిచేశారు. వారి కుటుంబానికి అన్ని విధాలఅండగా ఉంటామన్నారు రాములు గారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్న వ్యక్తి అంటే అది కేసీఆర్ అని అంటున్నారు. ప్రపంచ దేశాలలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు రెండు పంటలకు కలసిఎకరానికి పదివేలు చొప్పున ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ మాత్ర మే అని అన్నారు. సాగునీరు . తాగునీరు ఇచ్చినటువంటి మహానుభావుడు కెసిఆర్ గారు. 60 ఏళ్ళు కాంగ్రెసు పాలించిన ఏనాడు కూడా రైతుల కొరకు పోరాటం చేసిన వ్యక్తులు కారు. కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు రాష్ట్రానికి ఇచ్చింది ఏమీలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతుల కొరకు ప్రజల కోసం ప్రగతి కోసం శ్రమించిన సీఎం కేసీఆర్. అని ఆయన ఉన్నారు. ఈ కార్యక్రమంలో రంగాపూర్ సింగల్ విండో చైర్మన్ సురేందర్ రెడ్డి సీనియర్ నాయకులు అంజన్ రెడ్డి ఎంపీపీ భీమ్ అమ్మలాల్ యాదవ్ జిల్లా కో ఆప్షన్ సభ్యులు హమీద్ మండల్ రైతు కమిటీ కోఆర్డినేటర్ నారాయణ రావు గారు పాల్గొన్నారు.
ప్రజానే త్ర రిపోర్టర్ శ్రీనివాస రావు వంగూర్.