Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలోపట్టణాల్లోప్రజలుపైఆస్తిపన్ను #పెంపువిరమించుకోవాలిటిడ్కోఇళ్ళుపూర్తిచేసి #ఇవ్వాలనికోరుతూసీపీఎంధర్నా

0 77

రేపల్లే పట్టణ మునిసిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం కమిషనర్ గారికి వినతిపత్రం అందచేయటం జరిగింది. సిపిఎం రేపల్లే డివిజన్ కార్యదర్శి సిహెచ్.మణిలాల్ మాట్లాడుతూ నవంబర్ 23 తేదీ రాష్ట్రప్రభుత్వం పట్టణంలో ఆస్తిపన్ను సంస్కరణలు పేరుతో తీసుకువచ్చినా ఆర్డినెన్స్‌వల్ల ఇప్పుడు అమలు అవుతున్న పన్ను మీద అదనంగా పది రేట్లు ఆస్తిపన్నుతో పాటు మిగిలిన అని రకాల యూజర్ చార్జీలు,పన్నులు పెరుగుతాయ.గతంలో ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్స్‌ చట్టం 1955 సెక్షన్‌ 199 ప్రకారం మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో వార్షిక అద్దె విలువలో 15 శాతానికి తగ్గకుండా 30 శాతానికి మించకుండా ఆస్థిపన్నును ఉండేది మరియు 1965 సెక్షన్‌ 85 (2) చట్టం ప్రకారం మున్సిపాలిటీల పరిధిలో ఆస్తిపన్ను వార్షిక అద్దెవిలువలో 25 శాతానికి మించరాదు. ఇప్పుడు ఆర్డినెన్స్‌ ప్రకారం ఆస్తిపన్నును ఆస్తివిలువలో శాతంగా లెక్కిస్తారు మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో నివాస గృహాలకు ఆస్తివిలువలో 0.1 శాతంనుండి 0.5 శాతంవరకు ఆస్థిపన్నును మరియు నివాసేతరగృహాలకు ఆస్తివిలువలో 0.2 శాతంనుండి 2.0 శాతం వరకు, మున్సిపాలిటీల పరిధిలో నివాసగృహాలకు ఆస్తివిలువలో 0.1 శాతంనుండి 0.5 శాతంవరకు,నివాసేతరగృహాలకు ఆస్తివిలువలో 0.2 శాతంనుండి 2.0 శాతం వరకు ఆస్థిపన్ను నిర్ణయించారు దీని వల్ల పది రేట్లు పన్ను పెరుగుతుంది.ఇది పట్టణ ప్రజలుని దోపిడీ చేయటమే అని విమర్శించారు.కరోనా కష్ట కాలంలో ఇబ్బందులో ఉన్న పట్టణంలో పేద ప్రజల టిడ్కో ఇళ్ళు నిర్మాణాలు పూర్తి చేయాలి లబ్ధిదారులకు అందచేయాలి కానీ నిర్మాణ పనులు ఆపివేసి ఇళ్ళు ఇవ్వకుండా మోసం చేస్తూ ఇప్పుడు బాండ్స్ ఇస్తూ లబ్ధిదారులు ఇళ్ల తాలూకా అప్పులు సుమారు 4లక్షలు నుండీ 6లక్షలు చెల్లించాలి అని అగ్రిమెంట్ పేపర్లు మీద సంతకాలు చేయంచుకోవటం పట్టణంలో పేద ప్రజల్ని మోసం చేయటమే అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు,పట్టణ ప్రజలు కె.రమేష్,డి.శ్రీనువాసు,బి. నాగరాజు,సుబ్బారావు, శివయ్య తదితరులు పాల్గొన్నారు..రేపల్లె శ్రీకాంత్ ప్రజానేత్ర..

Leave A Reply

Your email address will not be published.

Breaking