శ్రీకాకుళం, పొందూరు,రాములమ్మను పలకరించిన సిక్కోలు చిరుదివ్వెలు బీజేపీ లో చేరిక మరింత బలం ధీరవనిత ఉద్యమస్ఫూర్తితో నేటి రాజకీయాల్లో కొత్త వరవడి ఎక్కడ అన్యాయం అక్రమం జరిగితే మీ తరుపున పోరాడేందుకు అక్కడ నేనున్నానంటూ నేటితరం యువతరానికి స్ఫూర్తిగా నిలిచిన సినీనటి రాజకీయ అగ్ని పర్వతం బీజేపీ నేత రాములమ్మను సిక్కోలు చిరుదివ్వెలు ఫౌండేషన్ చైర్మన్ హరికృష్ణ మర్యాదపూర్వకంగా ఫోన్లో పలకరించారు. తెలుగు తేజం రాజకీయ ఉషా కిరణం విజయశాంతి ఇటీవల బీజేపీలో చేరిన సందర్భాన్ని పురస్కరించుకొని హరికృష్ణ విజయశాంతి కి ఫోన్ లో అభినందనలతెలిపారు. ధీరవనిత ఇందిరాగాంధీ ఆదర్శంగా పోరాట యోధురాలు ప్రజా నాయకురాలు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఉద్యమస్ఫూర్తిని ఊపిరిగా తనదైన ప్రత్యేక గుర్తింపు పొందిన విజయశాంతి బీజేపీలో చేరడం తెలంగాణ నవ్యాంధ్రప్రదేశ్ లోనూ పార్టీ సంస్థాగత బలోపేతానికి ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా హరికృష్ణ విజయశాంతిని అభినందించారు. అంతా సమిష్టిగా ఉండాలని వెనుకబడిన జిల్లాలు ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలని విభజనతో నష్టపోయిన ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు ప్రగతి సాధించాలనే పరితపించే నాయకురాలు విజయశాంతి చేరిక బీజేపీ సంస్థాగత బలోపేతానికి దోహదపడుతుందని హరికృష్ణ ఆశా బావం వ్యక్తం చేశారు. నేటితరం రాజకీయాల్లో ఈ తరహా వ్యక్తులు అరుదుగా దొరుకుతారు
నేటి రాజకీయాల్లో కొత్త వరవడి మహిళలు యువతలో దేశభక్తి సమాజం పట్ల బాధ్యత ప్రేరణ కలిగించేలా బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ గా కళాశాల ప్రొఫెసర్ గా న్యాయవాదిగా ఉద్యమ నేతగా ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రతిఘటన , దేశంలో దొంగలు పడ్డారు, వందేమాతరం, ఆశయం, నేటి భారతం, ఒసేయ్ రాములమ్మ వంటి చిత్రాలతో సినీ లోకాన్ని మెప్పించిన విజయశాంతి రాజకీయాల్లో సైతం తనదైన ప్రత్యేక స్థానం చేరుకుంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదని హరికృష్ణ తెలిపారు. తెలంగాణ నుంచి బిజెపికి సీఎం అభ్యర్థిగా భవిష్యత్ రాజకీయాల్లో విజయశాంతి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చిక్కోలు చిరునవ్వే ఫౌండేషన్ చైర్మన్ హరికృష్ణ ఫోన్ లో ఈ సందర్భంగా ఆమెను అభినందించారు. గురుగుబెల్లి వెంకటరావు, ప్రజానేత్ర – రిపోర్టర్