Take a fresh look at your lifestyle.

పెన్షన్ కాన్సల్ అయి వృద్ధుల ఆవేదన

0 56

సారవకోట మండలం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో ప్రతిష్టత్మాకంగా ప్రారంభించిన సచివాలయం వ్యవస్థ ఎంతో బాగున్నప్పటికి కొన్నిచోట్ల ఆన్లైన్ పరమైన ఇబ్బందులు వల్ల ప్రజలు బాధపడుతున్నారు గుమ్మపాడు పంచాయతీ అక్కివలస గ్రామం లో నివసిస్తున్న బమ్మిడి సుగ్రీవులు, బమ్మిడి సీతమ్మ అనే వృద్ధ దంపతులు ఉన్నారు వాళ్ల రేషన్ కార్డు కాన్సల్ అవ్వడం జరిగింది,ఇంతకు ముందు పెన్షన్ కూడ ఆపేయ్యడం జరిగిందని ఆ వృద్ధులు తెలియజేయడం జరిగింది కనీసం నడవలేని స్థితిలో కూడ లేని మాకు ఏంటి కర్మ అని వాపోతున్నారు ఇంతకు ముందు పెన్షన్ కాన్సల్ అయినప్పుడు రాంగ్ ఆధార్ సీడింగ్ అయిందని చెప్పగా వాళ్ళు మండల ఆఫీస్ కి వెళ్లి క్లియర్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అదే కారణం చెప్పి రేషన్ ఆపేసారని రేషన్ బియ్యం పెన్షన్ తో బ్రతికే మాకు ఇలా చేస్తే మేము ఎలా బ్రతకాలని వాపోతున్నారు అలాగే ఆగదల గ్రామం లో 3కార్డులు, గోపాలపురం, కొత్తూరు లో కూడా ఇదే కారణం తో కార్డులు తొలగించడం జరిగింది. ఇదే సెక్రటరియేట్ లో అడ్డపనస గ్రామానికి చెందిన వరుదు చిన్నమ్మి అనే వృద్దురాలు కి కూడ వెట్ ల్యాండ్ చూపిస్తూ ఆమె రేషన్ ఆపివేయడం జరిగింది. ఈ విషయం పై స్థానిక సచివాలయం లో సంప్రదించగా మాకు సివిల్ సప్లై తో సంబంధం లేదని మీరు మండల ఆఫీస్ కి వెళ్లి కలవమని చెప్పారని వి ఆర్ ఓ ని అడిగితే డి టీ గారిని కలవమన్నారని, వాలంటీర్ ని అడిగితే నేను అల్లరెడీ జిరాక్స్ సబ్మిట్ చేశాను చెబుతున్నారని బాధితులు తెలియజేసారు అలాగే మాయందు దయచేసి మాయొక్క బాధను అర్ధం చేసుకొని రేషన్ ఇప్పించాలని లేకపోతే మాకు ఆకలి చావు తప్ప వేరే గతి లేదని ఎందుకంటే మేము నడిచే స్థితి లో కూడా లేమని తెలియజేసారు దయచేసి సంబందించిన అధికారులు స్పందించాలని కోరుతున్నాము..ప్రజా నేత్ర న్యూస్ :మురళీ కృష్ణ సారవకోట మండలం

Leave A Reply

Your email address will not be published.

Breaking