Take a fresh look at your lifestyle.

తూర్పు గోదావరి జిల్లా జర్నలిస్టులకు ఏపీ ప్రెస్ అకాడమీ శిక్షణా తరగతులు

0 62

విజయవాడ : గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల వృత్తి నైపుణ్యతను మెరుగు పరిచే ప్రక్రియలో భాగంగా సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ జిల్లాల వారీగా వరుస శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది. డిశంబర్ 16వ తేదిన తూర్పు గోదావరి జిల్లా జర్నలిస్టులకు వర్చువల్ ఆన్ లైన్ విధానంలో శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ ఉపన్యాస కార్యక్రమంలో ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ ప్రారంభ ఉపన్యాసం చేసారు. ముఖ్య అతిధిగా రాష్ట్ర వ్వవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా కలెక్టర్ డి.మురళీధర రెడ్డి,ఐఎఎస్, ప్రభుత్వ సలహాదారులు దేవులపల్లి అమర్ లు పాల్గొని సమాజంలో జర్నలిస్టుల ప్రాధాన్యత, వృత్తి నిబధ్ధతపై ప్రసంగించారు. ఏపీ ప్రెస్ అకాడమీ కార్యదర్శి మామిడిపల్లి బాలగంగాధర తిలక్‌ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆన్ లైన్ శిక్షణలో భాగంగా సీనియర్ పాత్రికేయులు ఆర్.దిలీప్ రెడ్డి, కె.వి రామిరెడ్డిలు వివిధ అంశాలపై తూర్పుగోదావరి జిల్లా జర్నలిస్టులతో వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి సమన్వయకర్తగా విక్రమ సింహాపురి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణారెడ్డి,స్రవంతీ చంద్ర వ్యవహారించారు.ఈ సంధర్బంగా రాష్ట్ర వ్వవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎల్ల వేళలా తన సహాకారం వుంటుందని హామి ఇచ్చారు. తాను గతంలో పాత్రికేయ వృత్తిలో పని చేసిన తన అనుభవాలను గుర్తు చేసుకుంటూ తూర్పు గోదావరి జిల్లా జర్నలిస్టులతో అనుభవాలను పంచుకున్నారు. ప్రస్తుతం జర్నలిజం పరిధి మరింతగా విస్తరించిందని,సోషల్ మీడియా పేరుతో అదుపు లేకుండా వార్తలు రావటం వల్ల అందరిలో గందర గోళం ఏర్పడుతుందని అన్నారు. గ్రామీణ విలేఖరుల కోసం వర్చువల్ ఆన్ లైన్ శిక్షణ తరగతులను ఏర్పాటు చేసిన ఏపీ ప్రెస్ అకాడమీని అభినందించారు.తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర రెడ్డి,ఐఎఎస్, మాట్లాడుతూ సమాజం అభివృధ్ది కోసం పాటు పడుతున్న జర్నలిస్టుల కృషిని కొనియాడారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవటానికి దోహదపడతాయని ఆయన అన్నారు.
ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే వార్తలను అనుసరించకుండా వీలయినంత వరకు ప్రత్యక్షంగా వెళ్ళి రిపోర్టింగ్ చేయటం వల్ల జర్నలిస్టుల్లో నైపుణ్యంతో పాటు ప్రజలకు దోహదపడే వార్తలను ఇచ్చిన వారమవుతామని, అన్ని రంగాలపై ఎప్పుడు నిత్య విద్యార్థిలా జర్నలిస్టులు విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని అన్నారు.ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ జర్నలిస్టుల సంక్షేమాన్ని కోరుకుంటుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టు వృత్తి నైపుణ్యతను పెంచే విధంగా ప్రెస్ అకాడమీ కృషి చేస్తుందని అందులో భాగంగా గ్రామీణ జర్నలిస్టులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తుందని అన్నారు. కరోనా నేపధ్యంలో ఏపీలో అన్ని జిల్లాల వారీగా ఆన్ లైన్ ద్వారా ఈ శిక్షణ తరగుతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జర్నలిజంలో మెళకువలు తెలియచేసే క్రమంలో ప్రెస్ అకాడమీ వృత్తి జర్నలిస్ట్ లు నైపుణ్యాన్ని పెంపొందించు కునే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టి పుస్తకాలను రూపొందించామని వాటిని ప్రస్తుతం పిడిఎఫ్ ఫైల్స్ వృత్తి జర్నలిస్ట్ లకు ఆన్ లైన్ లో అందుబాటు లో ఉంచడం జరిగిందన్నారు. దీనితో పాటు ప్రెస్ అకాడమీ రూపకల్పన చేస్తున్న వెబ్ సైట్ ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ శిక్షణలో భాగంగా సీనియర్ పాత్రికేయులు ఆర్.దిలీప్ రెడ్డి ”వార్తా రచన – తీసుకోవాల్సిన జాగ్రత్తలు” అంశాపై మాట్లడారు. మరో సీనియర్ పాత్రికేయులు కె.వి రామిరెడ్డి ”వార్తా సేకరించడంలో మెళకువలు – వార్తల్ని పసిగట్టడం ఎలా” అంశంపై తూర్పు గోదావరి జిల్లా జర్నలిస్టులతో తన అనుభవాలను పంచుకున్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

Leave A Reply

Your email address will not be published.

Breaking