భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ;ప్లాస్టిక్ నిషేధానికి ,పరిశుభ్రతకు నా వంతు సహాయ సహకారాలు అందజేస్తాను శ్రీ బి. శివాజీ (శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలం ఈవో ).జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పణ .పర్యావరణానికి భంగం కలిగించే ప్లాస్టిక్ నిషేధానికి తప్పనిసరిగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు దేవస్థానం ఈవో శ్రీ బి శివాజీ ,ఈ మేరకు జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జెడ్పి పౌండేషన్ బాధితులు మురళి మోహన్ కుమార్ తో పాటు సభ్యులు ఇవన్ని కలిసి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఇవాళ మాట్లాడుతూ జేడి ఫౌండేషన్ గురించి తమకు తెలుసునని తప్పనిసరిగా దేవస్థానం తరఫున ప్లాస్టిక్ నిషేధం తో పాటు పరిశుభ్రతకు పెద్దపీట వేస్తామని తెలిపారు ,ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జెడి ఫౌండేషన్ భాద్యుడు శ్రీ మురళీ మోహన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే భద్రాచలం పట్టణం చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలు అధికారులు మీడియా మిత్రులు సహకారంతో సింగల్ యూస్ ప్లాస్టిక్ ని నిషేధింపగాలిగామని తప్పనిసరిగా దేవస్థానం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జె.డి ఫౌండేషన్ సభ్యులు శ్రీ కడాలి నాగరాజు, శ్రీమతి అపర్ణ ,శ్రీ సంపత్ మరియు ఇటీవలే నూతనంగా ఏర్పాటు చేయబడిన జ్యూట్ బాగ్స్ ఇండస్ట్రీ అధినేత శ్రీ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్