Take a fresh look at your lifestyle.

ఒక్క అడుగు స్వచ్ఛత వైపు.

0 50

భద్రాచలం కరకట్ట గోదావరి నదీ తీరంలో జేడీ ఫౌండేషన్ మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ,అన్ని స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో స్వచ్ భారత్..స్వచ్ భద్రాద్రి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భద్రాచలం ASP డాక్టర్ వినీత్ IPS ,పద్మశ్రీ వనజీవి రామయ్య ముఖ్య అతిధులుగా హాజరయ్యి .కార్యక్రమాన్ని ప్రారంబించారు.కార్యక్రమం అనంతరం,ASP వినీత్, వనజీవి రామయ్య మాట్లాడుతూ ప్రజలందరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని లేకపోతే అనేక అనర్దాలను భవిష్యత్ లో చూడాల్సి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ వనజీవి రామయ్య “జేడీ ఫౌండేషన్” ద్వారా ప్లాస్టిక్ ఫ్రీ ఛాలెంజ్ ప్రారంభించి,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ , తెరాస పార్టీ ఐటీ శాఖా మంత్రి కెటియార్ కు , బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ,తెలంగాణ రాష్ట్ర సీఎం సెక్రటరీ స్మిత సబర్వాల్ కు ,ఖమ్మం కలెక్టర్ కర్ణన్ కు ప్లాస్టిక్ ఛాలెంజ్ ను విసిరారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ EO వెంకటేశ్వర్లు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ కంభం పాటి సురేష్ ,జేడీ ఫౌండేషన్ బాద్యులు మురళి మోహన్ ,జేడీ ఫౌండేషన్ సభ్యులు,లయన్స్ క్లబ్ సభ్యులు, పరశురామ్ పరివార్ సంస్థ సభ్యులు, గ్రీన్ భద్రాద్రి సభ్యులు,సంపత్, రనాగరాజు,సూర్యనారాయణ,రఫీ,తిరుమల రావు,అపర్ణ,రోటరీ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని స్వచ్ఛంద సంస్థ సభ్యులకు జేడీ ఫౌండేషన్ బాధ్యులు మురళి మోహన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు .

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

Leave A Reply

Your email address will not be published.

Breaking