Take a fresh look at your lifestyle.

అన్నదాతకు అండగా ఉంటాం… రైతు ద్రోహి మోడీ ప్రభుత్వం ఐక్యవేదిక ఆధ్వర్యంలో దీక్ష

0 55

గూడూరు : అన్నదాతకు అండగా ఉంటామని వక్తలు పేర్కొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని గ్రామ సేవకుల భవనం ఎదుటఢిల్లీ సరిహద్దులో 25 రోజులుగా ఒక్కరోజు దీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు చేవూరు విజయ మోహన్ రెడ్డి మాట్లాడుతూ అన్నదాతకు హాని కలిగించే చట్టాలను రద్ధు చేయాలన్నారు. రక్తం గడ్డకట్టే చలిలో అన్నదాతలు 25రోజుల నుండి దీక్ష చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. రైతు దినోత్సవం రోజున ఏర్పాటు చేసిన దీక్షలో ఒక రైతుగా పాల్గనడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీపీఐ పట్టణ కార్యదర్శి షేక్ కాలేషా మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు బీజేపీ పాలకులు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. రైతును ఇబ్బంది పెట్టిన ఏ ప్లభుత్వమూ మనుగడ సాధించిన దాఖలాలు లేవన్నారు. వెంటనే నాలుగు నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి పరిమళ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. మోదీ ఓ నియంతలా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ. అబ్దుల్ రహీం మాట్లాడుతూ రక్తం గడ్డకట్టే చలిలో 25రోజులంగా రైతులు దీక్ష చేస్తూ 33 మంది అమరులయ్యారన్నారు. కేంద్రం రైతు చట్ఞాలను రద్దుచేయాలంటే మరెంత మంది రైతులు బలి కావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎస్పీ నాయకులు నాశిన భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో అన్నదాతకు మద్దతుగా గూడూరులో దీక్ష చేపట్టడం శుభపరిణామం అన్నారు. మాలమహానాడు జిల్లా నాయకులు పల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోన్న బీజేపీ ప్రభుత్వానికి దేశ ప్రజలు చరమగీతం పాడుతారన్నారు. అబ్దుల్ కలాం ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సయ్యద్ తాజుద్దీన్ నిమ్మరసం అందించి దీక్షను విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో
భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ షేక్ జీలానీబాష, కో కన్వీనర్ అబ్దుల్ రహీం, ఇజ్రాయెల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిమళ వెంకటేశ్వర్లు, శ్రీనివాసాచారి, సీపీఎం నాయకులు ఏ. కేశవులు, సీపీఐ నాయకులు షేక్. కాలేషా, ఎంబేటి చంద్రయ్య, బీఎస్పీ నాయకులు నాశిన భాస్కర్ గౌడ్, మాలమహానాడు నాయకులు పల్లి కోటేశ్వరరావు, ఎఐవైఎఫ్ నాయకులు సునీల్ యాదాల, చల్లా వెంకటేశ్వర్లు, బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు ఆర్ కే. యాదవ్, రజక సంఘం రాష్ట్ర నాయకులు ఎల్ వీ. సుబ్బయ్య, మాల మహానాడు నాయకులు పారిచర్ల సుబ్బరాయుడు, ఈద్ గాహ్ యూత్ సభ్యులు షబ్బీర్, హాషిం, యస్థాని, ఇన్సాఫ్ నాయకులు అన్వర్ బాష, జమాలుల్లా, కబీర్, ఉమర్, నయీమ్, సయ్యద్ జమీల్ అహ్మద్, షఫీ మౌలానా, ఎల్ సీఎన్ రఫీ, ఖైర్ ఖా మైనారిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జీలానీ బాష, మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.ప్రజానేత్ర రిపోర్టర్ మెదూరు శ్రీనివాసాచారి గూడూరు.

Leave A Reply

Your email address will not be published.

Breaking