Take a fresh look at your lifestyle.

సీఎం కేసీఅర్ కు బహిరంగ లేఖ రాసిన వైఎస్ షర్మిల

0 416

ఖమ్మంలో BRS బహిరంగ సభ సందర్భంగా సీఎం కేసీఅర్ కు బహిరంగ లేఖ రాసిన YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఆ లేఖ ఇదే..

గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి..
భవిష్యత్తు లేని బీఆర్ఎస్ ఎజెండాను దేశంపై రుద్ద డానికి.. మీ స్వార్థ రాజకీయాలను దేశ వ్యాప్తం
చేయడానికి ఖమ్మం జిల్లాలో మీరు సభ నిర్వహించడం హాస్యాస్పదం. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర మంతా మీ తీరును చూసి, నివ్వెరపోతున్నారు. గత 9 ఏండ్లుగా ఖమ్మం జిల్లా కు మీరు చేసిందేమీ లేదు. మీ నియంత పాలనలో ఖమ్మం జిల్లా ప్రజలు విసుగుచెందారు. రాజకీయ, సాంస్కృతిక చైతన్యానికి ప్రసిద్ధి చెందిన ఖమ్మం జిల్లా ప్రజలు..

గత ఎన్నికల్లో మిమ్నల్ని ఘోరంగా ఓడించి, మీ పాలనకు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారు. అదే ఖమ్మం జిల్లా లో జనవరి   18న సభ నిర్వహించి, రాజకీయ లబ్ధి పొందాలని చూడడం సిగ్గు చేటు.
రెండు దఫాల్లోనూ ఖమ్మం జిల్లా కు మీరు చేసింది శూన్యం.

మళ్లీ అదే ఖమ్మం జిల్లా ను మీ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. మీరెంత చేసినా వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా జనం మీకు బుద్ధి చెప్పడం ఖాయం. గత 9 ఏండ్లుగా మీ నిర్లక్ష్యపూరిత ధోరణితో ఖమ్మం జిల్లా వెనుకబడిపోయింది. సాగు నీటి ప్రాజెక్టు లు అసంపూర్తిగా మిగిలాయి.

ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందాల్సిన జిల్లా .. నేడువెలవెలబోతోంది. వరదలను అరికట్టడంలో, బాధితులను ఆదుకోవడంలో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది. మిర్చి రైతుల  ఆర్తనాదాలు ఏనాడూ మీ చెవినకెక్కలేదు. పంట నష్టపోయి, రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా  కనీసం స్పందించలేదు. మీ ఏలుబడిలో ఖమ్మం జిల్లా ప్రజలకు జరిగిన అన్యాయాన్ని.. ప్రజల పక్షాన, YSR తెలంగాణ పార్టీ తరుఫున మేం ప్రశ్నిస్తున్నాం. మీకు దమ్ముంటే సభ నిర్వహించే లోపు వీటికి సమాధానం చెప్పండి.

1. ఆంధ్రప్రదేశ్లో ఏడు మండలాల విలీనానికి వ్యతిరేకంగా మీరు ఎందుకు పోరాటం చేయడం లేదు?
సమస్యాత్మకంగా ఉన్న భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని ఎందుకు
కోరడం లేదు?
2. ఎనిమిదేండ్లుగా సీతారామ ప్రాజెక్టు ను ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఈ ప్రాజెక్టు కోసం కేటాయించిన
దాదాపు రూ.13000 కోట్లు ఏమైనట్టు ?
3. భద్రాచలం ఆలయాన్ని రూ.100కోట్లతో అభివృద్ధి చేస్తామని 2016లో మీరు ఇచ్చిన హామీ ఎక్కడ పోయింది?
4. భారీ వరదలకు వేలాది మంది బాధితులు రోడ్డు న పడితే ఎందుకు ఆదుకోలేదు? నష్టపోయిన పంటలకు
ఎందుకు పరిహారం ఇవ్వలేదు?
5. భద్రాచలం ముంపు ప్రాంతాల పరిరక్షణకు రూ.1000 కోట్లు కేటాయిస్తు న్నామని గొప్పలు చెప్పిన మీ ప్రభుత్వం,
ఇంకా ఎందుకు పనులు మొదలుపెట్టలేదు?
6. ఎనిమిదేండ్లుగా పోడు పట్టాలు ఎందుకు ఇవ్వలేదు? పోడు పట్టాలు అడిగిన పాపానికి చంటి పిల్లను
తల్లులను కూడా జైలులో వేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
7. సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య సాగుతున్న హైడ్రామా ఇంకెప్పుడు
ముగుస్తుంది?
8. ధరణి పోర్టల్ వల్ల రాష్ట్రంతోపాటు ఖమ్మం జిల్లా రైతులు సైతం ముప్పుతిప్పలు పడుతుంటే మీ ప్రభుత్వం ఏం
చేస్తుంది?
9. గ్రానైట్ పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీలపై మీ వైఖరి ఏంటి?
10. జిల్లా లో మిర్చి రైతుల ఆత్మహత్యలు ఎందుకు అరికట్టడం లేదు? ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు
మీరు చేసిందేంటి?

గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని మరొక్కసారి విజ్ఞ ప్తి చేస్తున్నాం. మీరు ఖమ్మం గడ్డపై అడుగుపెట్టేలోపు
పైసమస్యలపై స్పందిస్తారని ఆశిస్తున్నాం. పాత అబద్ధాలను ప్రచారం చేస్తూ, కొత్త అబద్ధాలతో ప్రజలను నమ్మించే
మీరు.. ఈసారైనా నిజాలు మాట్లాడుతారని భావిస్తున్నాం. ఖమ్మం జిల్లా అభివృద్ధి పై మీకు నిజంగానే చిత్తశుద్ధి
ఉంటే పై ప్రశ్నలపై ప్రజలకు సమాధానం చెప్పండి. ఒక బాధ్యతాయుత రాజకీయ నాయకురాలిగా, ప్రజా
సమస్యలపై అవిశ్రాంతంగా పోరాడుతున్న నేతగా ప్రజల పక్షాన మరోసారి ప్రశ్నిస్తున్నాం. మీ నుంచి పైవాటికి
సమాధానాలు వస్తాయని భావిస్తున్నాం.

Warm regards,

Y S Sharmila
President, YSR Telangana Party

Leave A Reply

Your email address will not be published.

Breaking