Take a fresh look at your lifestyle.

యువత రక్తదానం చేయాలి : మంథని ఆర్డీవో

0 37

యువత రక్తదానం చేయాలి
ఆపదలో ఉన్న వారిని రక్షించాలి
మంథని రెవెన్యూ డివిజనల్ అధికారి కె. వీరబ్రహ్మచారి

మంథని : యువత ముందుకు వచ్చి ప్రతి మూడు నెలలకొక్కసారి రక్తదానము చేసి, ఆపదలో వున్నవారి ప్రాణాలు కాపాడుతూ ప్రాణ దాతలు కావాలని మంథని రెవెన్యూ డివిజనల్ అధికారి కె. వీరబ్రహ్మచారి పిలుపునిచ్చారు. శనివారం సహాయ చారిటబుల్ ట్రస్టు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి, లయన్స్ క్లబ్ ఆఫ్ మంథని సంయుక్త ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్త నమూనా సేకరణ, రక్తదాన శిబిరాన్ని మంథని రెవెన్యూ డివిజనల్ అధికారి కె. వీరబ్రహ్మచారి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ కార్యక్రమములో 33మంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానము చేశారు. ఇట్టి రక్త దాన శిబిరంలో ముత్తారం మండలము సీతంపల్లి గ్రామనికి చెందిన వార్డు సభ్యుడు దివ్యాంగుడు మామిడి సంపత్ కుమార్ కూడా రక్త దానము చేసి పలువురికి ఆదర్శముగా నిలిచినందుకు ఆయనను రెవెన్యూ డివిజనల్ అధికారి కె. వీరబ్రహ్మచారి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘము పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తూము రవీందర్, మంథని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ కంది శ్రీనివాస్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి,జిల్లా కన్వీనర్ కావేటి రాజగోపాల్, సహాయ చారిటేబుల్ ట్రస్టు అధ్యక్షులు మేడగొని వెంకటేష్ లు ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం రక్తదానం చేసిన వారికి 33 మందికి అభినందన పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమములో గౌతమేశ్వర ఆలయ కమిటి చైర్మన్ మేడగోని రాజమౌళి గౌడ్, ఇల్లెందుల కిషోర్, రావికంటి సతీష్, మాచిడి మోహన్ గౌడ్, వీర శంకర్, కమ్మగోని రవికుమార్, బుద్దార్తి సతీష్, బొడ్డు సతీష్, కొమురోజు సురేష్, ఐతు డేవిడ్, కంది రవి, వేణు, మంథని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ సీనియర్ సహాయకులు రవి శంకర్, సహాయ చారిటబుల్ ట్రస్టు సభ్యులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking