Take a fresh look at your lifestyle.

మే 27 న హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో యోగా కార్యక్రమం

0 11

మే 27 న హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో యోగా కార్యక్రమం

యోగా చేస్తే డాక్టర్లు, ఆసుపత్రులు అవసరం లేదు

ఇస్లామిక్ దేశాలు సైతం యోగాను అధికారికంగా నిర్వహిస్తున్నాయి

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, మే 21 : యోగా అనేది ఏ మతానికో .. సంస్కృతికో సంబంధించినది కాదని, ప్రతి మనిషి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచేందుకు యోగా ఒక సాధనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో మే 27న 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. ఇందులో ప్రతీ ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

“ఏదైనా పనిని ఎంతో ఉత్సాహంతో ప్రారంభించడం.. కొనసాగించడం అనేది చాలా ముఖ్యం. అనేక వేల సంవత్సరాల క్రితం నుంచి మన దేశ ప్రజల జీవనంలో యోగా భాగమైంది. దానిని మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రపంచానికి పరిచయం చేశారు. అలాగే ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది కూడా జూన్ 21 తేదీ ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరుకు అనేక దేశాలు అధికారికంగా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.

అనేక కంపెనీల్లో యోగా కోసం ప్రత్యేక ఫ్లోర్స్ కేటాయిస్తున్నారు. ప్రతీ రోజు అక్కడ యోగా చేయడం మనకు గర్వకారణం. మనదేశంలోని అనేక పార్కులు, సంస్థలు, కాలనీల్లో యోగా శిక్షణ కేంద్రాలు నడుపుతున్నారు. దీని ద్వారా మన మేధస్సు పెరుగుతుంది. ఎవరైనా సరే తమ వృత్తుల్లో మెరుగైన ఫలితాలు రాబట్టడానికి యోగ ఉపయోగపడుతుంది. ఏడాది కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి, భారత ప్రభుత్వం సంయుక్తంగా అనేక చర్యలు తీసుకుంటున్నాయి.

అంతర్జాతీయ యోగా ఉత్సవాన్ని మన దేశంలో ఆజాద్ కా అమృత్ మహోత్సవం సెకెండ్ ఫేజ్ లో భాగంగా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. మన దేశంలోని ప్రతీ గ్రామంలో .. ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులు జూన్ 21వ తేదీన యోగా కార్యక్రమాన్ని జరుపుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఎవరి కోసమో కాదు.. ప్రతీ ఒక్కరి కుటుంబానికి మంచి బాట వేయడానికి ఉపయోగపడుతుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking