Take a fresh look at your lifestyle.

రాష్ట్రాభివృద్ధికి సహకరించాలనే లేఖలు రాస్తున్న..

0 19

ప్రధాని వస్తే కలిసేందుకు సీఎంకు తీరికలేదు..

కానీ మహారాష్ట్రలో మీటింగ్ లు పెడ్తారట

–  కేంద్రమంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17 (వైడ్ న్యూస్) తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చేస్తున్న సహకారాన్ని సంపూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూనే సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తున్నానని.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

మోసపూరిత హామీలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల కుటుంబానికి మరోసారి అధికారంలోకి రావాలనే ఆలోచనే తప్ప.. తెలంగాణ అభివృద్ధికోసం ఏదైనా చేయాలనే ధ్యాసే లేదని కిషన్ రెడ్డి విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో రాష్ట్ర పురోగతి కోసం చేపడుతున్న కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతూ తన లేఖల పర్వం కొనసాగుతోందన్న కేంద్రమంత్రి.. కేసీఆర్ కు ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం రాష్ట్రం అభివృద్ధి చెందాలని లేదని అన్నారు.

తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించటం మాత్రమే కేసీఆర్ కు తెలుసని, కేంద్రం అందించే సహకారాన్ని అందిపుచ్చుకునే ఆలోచన ఎంతమాత్రమూ లేదన్నారు.

ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి వస్తే.. కలిసేందుకు ముఖ్యమంత్రికి తీరిక లేదని, మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరించాలన్న ఆకాంక్షతో గాలిలో దీపం పెట్టినట్లు.. అక్కడ మీటింగ్ లు పెడుతున్నారన్నారు.

భద్రాచలంలో శ్రీరామ కల్యాణోత్సవానికి హాజరై ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించేందుకు తీరికలేని కేసీఆర్ కు.. రంజాన్ సందర్భంగా వేషాలు మార్చుకుంటూ ఇఫ్తార్ విందుల్లో పాల్గొనేందుకు సమయం దొరుకుతోందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking