Take a fresh look at your lifestyle.

కంగ్రాట్యులేషన్ నిఖత్ జరీన్.. : డీజీపీ

0 65

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌ నిఖత్ జరీన్ ను

అభినందించిన డీజీపీ అంజనీ కుమార్

హైదరాబాద్, ఏప్రిల్ 6 (వైడ్ న్యూస్) హైదరాబాద్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ 50 కిలోల విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకొని రికార్డ్ సృష్టించిన నిఖత్ జరీన్ ను ఈరోజు డీజీపీ అంజనీ కుమార్ శాలువా, పుష్పగుచ్చాలతో అభినందించారు. బీఆర్ కేఆర్ భవన్ లో సి.ఎస్. శాంతి కుమారి గారిని ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్బంగా ఒక సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన డీజీపీ అంజనీ కుమార్ నిఖత్ జరీన్ ను అభినందించారు. ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు గెలుచుకున్న రెండవ భారతీయ బాక్సర్‌గా నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించిందని, నేటి యువ క్రీడాకారులకు జరీన్ ఆదర్శవంతంగా నిలిచిందని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్.సి అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాలు పాల్గొన్నారు. .

Leave A Reply

Your email address will not be published.

Breaking