Take a fresh look at your lifestyle.

పశువైద్య కళాశాల విద్యార్థిని ప్రతిభ

0 30

రెండు స్వర్ణ పతకాలు సాధించిన

కోరుట్ల పశువైద్య కళాశాల విద్యార్థిని

కోరుట్ల , ఏప్రిల్ 18 : పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయ 4వ స్నాతకోత్సవంలో కోరుట్ల పశు వైద్య కళాశాలకు చెందిన విద్యార్థిని డాక్టర్ .అన్నపురెడ్డి ప్రవళిక బివిఎస్సీ అండ్ ఏహెచ్ రెండు విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించింది.

పీవీ నరసింహారావు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ రవీందర్ రెడ్డి, రాజస్థాన్ వెటర్నరీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ సతీష్ కుమార్ ల చేతుల మీదుగా పివి నరసింహారావు విశ్వవిద్యాలయంలోని ఉత్తమ విద్యార్థినికి ఇచ్చే దిశ బంగారు పతకం ,వెటర్నరీ డిగ్రీలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఇండియన్ ఇమ్యునీలాజికల్ వారి బంగారు పతకం అందు కున్నారు.

ఈ సందర్భంగా ప్రవళిక మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రొఫెసర్ల ప్రోత్సాహంతోనే తాను స్వర్ణ పథకాలు గెలుచుకున్నానని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం డాక్టర్ టి మాధవరావు, డాక్టర్ జిఎస్ఎస్ మూర్తి, డాక్టర్ కె లక్ష్మీ, కళాశాల బోధ నేతల సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking