ఖాళీ బిందేలతోమహిళల నిరసన
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలోని రెండో వార్డు కౌన్సిలర్ గోపాలమ్మ వెంకటయ్య ఆధ్వర్యంలో బీసీ కాలనీ మహిళలు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో బైఠాయించారు.
1983 లో ఏర్పడిన తమ కాలనీకి త్రాగునీరు, మౌళిక సదుపాయాలు కల్పించడంలో గత పాలకులందరూ విఫలమయ్యారన్నారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. కాలనీలో మంజీరా నీటి సరఫరా లేదని, విద్యుత్ సౌకర్యం లేదని, వీధి లైట్లు లేవని వాపోయారు. గతంలో కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్, లోకాయుక్త కోర్టుకి తమ సమస్యల గురించి అనేక సార్లు వినతి పత్రం అందజేసినా ఫలితం లేదన్నారు. గత 30 ఏళ్లుగా ఓట్లు వేయించుకుంటూ అభివృద్ధిలో నిర్లక్ష్యం, కక్ష సాధింపు చర్యలు వల్ల తమ కాలనీ వాసులు ఎంతో వెనుకబడి పోయామన్నారు. అనంతరం మున్సిపల్ మేనేజర్ నిర్మలా రెడ్డి కి వినతి పత్రాన్ని అందజేశారు.