Take a fresh look at your lifestyle.

వాట్సాప్  చాటింగ్ ఫేకా..? కవితా  కాలు ఫ్రాక్చర్ ఫేకా…?

0 263

ఏది ఫేక్ ..?  ఏది రియల్..??

వాట్సాప్  చాటింగ్ ఫేకా..? కవితా  కాలు ఫ్రాక్చర్ ఫేకా…?

మోదీ హైదరాబాద్ సభ తరువాత

మారతున్న రాజకీయాలు.. 

హైదరాబాద్, ఏప్రిల్ 13 (వైడ్ న్యూస్) సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పేరు తాజా రాజకీయాల చుట్టూ తిరుగుతూనే ఉంది. బీఆర్ ఎస్ లో ముఖ్య నాయకులు ఎందరో ఉండగా కవితను మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నారనే విషయంలో చర్చా ప్రారంభమైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ఇన్ వాల్వ్ ఉందని ఈడీ అధికారులు విచారణ చేసిన విషయం విధితమే. ఇప్పుడో.. అప్పుడో కవిత అరెస్ట్ తప్పదనే సంకేతాలు జోరుగా షికారు చేశాయి. కానీ.. ముచ్చటగా మూడు సార్లు కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారించిన ఈడీ అధికారులు స్టేట్ మెంట్ మాత్రమే తీసుకున్నారు.

ఎమ్మెల్సీ కవిత చుట్టూ…

సుఖేష్ చంద్రశేఖర్ జైల్ నుంచి విడుదల చేస్తున్న వాట్సాప్ ఛాటింగ్ లు కవిత అవినీతి చుట్టూ తిరుగడంతో ఆమె మరోసారి వార్తలలోకి వచ్చింది. 15 కోట్ల రూపాయలు తాను బీఆర్ ఎస్ ఆఫీస్ లో అంద చేసినట్లు కారు వివరాలతో సహా సుఖేష్ పేర్కొనడంతో ఈ ఆంశాన్ని బీజేపీ అనుకూలంగా మలుచుకుంటుంది.

మీడియా కక్షగట్టి వార్త కథనాలు..

అయితే.. తాను మాత్రం అమాయకురాలిని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్త కథనాలు ప్రచారం చేస్తున్నాయని సీఎం కేసీఆర్ కూతురు కవిత ప్రకటన విడుదల చేసింది.  తెలంగాణ ఆడ బిడ్డనైన తనపై కక్ష గట్టి ఉద్దేశ్య పూర్వకంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారని కవిత పేర్కొంది.

బిఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణను, కెసిఆర్ గారి జాతీయ స్థాయి కార్యాచరణను రాజకీయంగా ఎదుర్కునే ధైర్యం లేక తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని పేపర్లు, టీవి ఛానెళ్లు, యూ ట్యూబ్ మీడియాల ద్వారా పనిగట్టుకొని బిఆర్ఎస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని కవిత ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్థిక నేరగాడితో నాకు సంబందం లేదు..

అయితే.. సుఖేష్ చంద్రశేఖర్ ఆర్థిక నేరగాడితో ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఉంటే ఈడీకి ఇచ్చిన సెల్ ఫోన్ లో ఈ చాటింగ్ బహిర్గతం కావచ్చానేది సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో నాకు పరిచయం కూడా లేదు. అతనెవరో కూడా నాకు తెలియదు. కానీ వాస్తవాలను ఏవి పట్టించుకోకుండా, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో, పనిగట్టుకొని తప్పుడు వార్తలు ప్రచురించి నా పరువు తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కవిత. ఈ సందర్భంగా పాత్రికేయులు విలువలు పాటించడం లేదని కవిత మాట్లాడుతున్న తీరు మీడియా వర్గాలలో చర్చానీయంశంగా మారింది.

మీడియాపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

పార్టీకో న్యూస్ ఛానల్.. డైలీ పేపర్ లు ఉన్న నేటి కాలంలో అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత తన పరువు తీస్తున్న మీడియా గురించి మాట్లాడటంలో తప్పు లేదు. పాత్రికేయులు కనీస విలువలు పాటించక పోవడం అత్యంత బాధాకరం. రాజకీయ ఎజెండాలో మీడియా సంస్థలు కూడా పావుగా మారడం, బి ఆర్ యస్ పార్టీ పై అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేయడం చూస్తే ఎన్నికల ఏడాదిలో మరెంతో దిగజారి వార్తలు ప్రసారం చేస్తారు అని తెలంగాణ సమాజం గ్రహించాలని కవిత జాగ్రత్తలు చెబుతూ ప్రజలలో తాను తప్పు చేయాలేదనే వాదన వినిపించడానికి యత్నిస్తోంది.

కవిత అవినీతిపై పార్టీ పెద్దల మౌనం..

కల్వకుంట్ల కవిత తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ప్రభుత్వంలోని పెద్దలు మౌనం ఉండటం వెనుకు అంతర్గతం ఏమిటో అర్థం కాని ప్రశ్నగా మిగిలి పోయింది. శివుడు ఆజ్ఞ లేనిదే చీమాయిన  కుట్టదు అన్నట్లుగా సీఎం కేసీఆర్ అనుమతి లేకుండా మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్ లు నోరు విప్పరనేది కవితపై వచ్చిన అవినీతి ఆరోపణల విషయంలో తెలుస్తోంది.

కొస మెరుపు.. 

ఇటీవల ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన, బహిరంగ సభ అనంతరం రాష్ట్ర రాజకీయాలు అనుహ్యంగా మలుపు తిరుగుతున్నాయి. ఈ సభ వేదికగా ప్రధాని కవితకు జైల్ తధ్యమని పరోక్ష సంకేతం ఇచ్చినట్లుగా బీజేపీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. అవినీతి పరులను శిక్షించాలా వద్దా..? అని అడిగి మరి శిక్షించాలనే  ప్రధాని ప్రజామోదం తీసుకుని వెళ్లారు. అంతెగాదు.. కుటుంబ పాలన అనే పదంను పదుల సంఖ్యలో వాడుకున్నారు ప్రధాని. కుటుంబ పాలనలో అవినీతి ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన మోదీ కవిత తరువాత ఆ ఫ్యామిలీ మెంబర్స్  టార్గెట్ గా చెప్పకనే చెప్పారు ప్రధాని మోదీ. ఇదే ఆంశం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది.  తాజా రాజకీయాలను ప్రతిపక్షాలు సైలెంట్ గా ఆసక్తిగా గమనిస్తున్నాయి.

  • వయ్యామ్మెస్

Leave A Reply

Your email address will not be published.

Breaking