Take a fresh look at your lifestyle.

రైలు ప్రమాదాలకు ముగింపు ఎప్పుడు..?

0 11

రైలు ప్రమాదాలకు ముగింపు ఎప్పుడు..?

ఢిల్లీ, జూన్ 3 : ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతులు సంఖ్య పెరుగుతూనే ఉంది. అక్కడ బాధితులను వెలికితీయడంలో రెస్క్యూ టీం శ్రమిస్తున్నాయి. విశాఖ నుంచి సీనియర్ అధికారులు, రెస్క్యూ టీం సభ్యులు ఒరిశా బయలుదేరి వెళ్లారు.విశాఖ నుంచి వెళ్లి రెస్క్యూ టీం సభ్యులు అక్కడ మృతదేహాలను వెలికితీస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. గాయపడిన వారిని గోపాల్పూర్, ఖంతపరా, బాలాసోర్, భద్రక్ మరియు సోరో ఆస్పత్రులకు తరలించారు.ఈ ఘటనతో కోరమండల్ ఎక్స్ప్రెస్కు చెందిన 15బోగీలు బోల్తాపడ్డాయి.

ఈ ప్రమాదం అక్కడితోనే ఆగలేదు. బోల్తాపడ్డ కోరమండల్ కోచ్లను పక్కనే ఉన్న మరో ట్రాక్పై నుంచి దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. 3రైళ్లు ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే ఈ రైల్లో ప్రయాణిస్తున్న వారిలో పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రయాణికులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో కూడా వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రైళ్లలో ఏపీలోని విజయవాడకు చెందిన వారు కూడా ప్రయాణిస్తున్నట్లు తెలిసింది.

ప్రమాదం జరిగిన తీరును చూస్తే సాంకేతిక లోపంతో పాటు మానవ తప్పిదం కూడా ఉంది అనే అనుమానాలు తలెత్తున్నాయి. సుమారు 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో ఒకటి కాదు మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్లోని హోప్డా వెళ్తున్న బెంగళూరు హోప్డా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు మొదట పట్టాలు తప్పింది. ఈ రైలుకు చెందిన 4 బోగీలు పక్కనున్న ట్రాక్పై బోల్తా పడ్డాయి. దీనికి సాంకేతిక లోపమే కారణమయుంటుందని భావిస్తున్నారు.

మరికొద్ది క్షణాల్లో గమ్యానికి చేరుకునేవారు.కానీ ఎదురైన మృత్యువు విసిరిన యమపాశానికి బలై తిరిగిరాని లోకానికి పయణమయ్యారు.రైల్వే వ్యవస్ధలోనే ఇంతటి భారీ ప్రమాదం చరిత్రలో నిలిచిపోయి … విషాద చాయలు వెంటాడుతూనే ఉంటాయి.ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందుకునే రైల్వే శాఖ .. ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని తాజా ఘటన సూచిస్తోంది.మరి ఇప్పటికైనా ప్రమాదాలకు రెడ్ సిగ్నల్ పడుతుందో లేదో చూడాలి ….

Leave A Reply

Your email address will not be published.

Breaking