Take a fresh look at your lifestyle.

మాస్టర్‌ ప్లాన్‌ను పూర్తి స్థాయిలో సవరిస్తాం

0 152

జగిత్యాల పట్టణ శివారు గ్రామాలను మాస్టర్‌ ప్లాన్‌ నుండి మినహాయిస్తాం

జగిత్యాల జిల్లా // ప్రభుత్వ భూముల్లోకి రిక్రియేషన్‌, పబ్లిక్‌ సెక్టార్‌, డపింగ్‌, ఇండస్ట్రియల్‌ జోన్లను తరలిస్తామన్నారు సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌.

రైతులకు కించిత్‌ నష్టం కలుగకుండా చర్యలు తీసుకుంటామని, ప్రస్తుత మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‍ను తిరస్కరిస్తున్నమన్నారు ఆయన.

ప్రజా ఆందోళనను, రైతుల ఆవేదనను అర్థం చేసుకున్నమన్నారు మంత్రి.

జగిత్యాల మున్సిపల్‌కు సంబందించి రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ను పూర్తిస్థాయిలో సవరించి, రైతులకు, ప్రజలకు కించిత్‌ నష్టం లేకుండా చూస్తామని  మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పత్రిక ప్రకటనను జారీ చేశారు.

రైతుల భూముల్లో ఎలాంటి ఇబ్బందికర జోన్‌లు ఉండవని, రైతులకు కించిత్‌ ఇబ్బంది కాదని, రైతులు తమ భూమిలో ఒక గుంట భూమిని కూడా నష్టపోకుండా చూసే బాధ్యత తమదేనన్నారు. రైతులు ఆందోళనలను విరమించాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking