Take a fresh look at your lifestyle.

పేపర్ లీకేజ్ పై రాష్ట్రపతిని కలుస్తాం..

0 411

పేపర్ లీకేజ్ పై సిబిఐతోె విచారణ చేయాలని రాష్ట్రపతిని కలుస్తాం..

: బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

జోగులాంభ గద్వాల , మార్చి 31 (వైడ్ న్యూస్) పరీక్ష పేపరుల లీకేజ్ వ్యవహరంలో  నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాకర్ట్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమారు.  ఇప్పటికే గవర్నర్ గారిని కలిశాం. త్వరలో రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేయబోతున్నామన్నారు  ఆయన. 30 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసిన విషయం గుర్తు చేశారు.

జోగులాంభ గద్వాల జిల్లా ఆలంపూర్ ప్రాంతంలో పాదయాత్ర చేసిన సందర్భంగా శాంతి నగర్ లో మీడియాలో ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. పోలీసులు గ్రూప్ 1 పేపర్ లీకేజీ మీద ప్రత్యేక కేసు నమోదు చేయడం లేదన్నారు ఆయన. కేసులు పెడితే కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలేదన్నారు ఆయన. జనార్దన రెడ్డి కేవలం ప్రవీణ్ కు 103 మార్కులు వచ్చాయన్నారు.

కానీ కమీషన్ ఉద్యోగులు ముగ్గురికి 100 పైగా మార్కులు వచ్చాయి. ఈ విషయం మీకు తెలియదా? అంటూ జనార్ధన్ రెడ్డిని ప్రశ్నించారు ప్రవీణ్ కుమార్. పేపర్ లీకేజీ పై పోరాటం చేస్తే కేయూ విద్యార్థులపై కేసులు పెట్టి తెల్లవారుజామున అరెస్టు చేసి తీసుకెళ్లడం ఏమిటని ప్రశ్నించారు ఆయన.

ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో అనేక ప్రశ్నాపత్రాలు దొరికాయి. మరికొందరు నిందితుల ఇళ్లల్లో ప్రశ్నాపత్రాలతో పాటు జవాబులు కూడా దొరికాయి. అయినా సిగ్గు లేకుండా మళ్లీ  పరీక్షలు పెడతామని కమీషన్ చైర్మెన్ చెబుతున్నారు. వెంటనే పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు ప్రవీణ్ కుమార్. ముఖ్యమంత్రి వెంటనే కేబినెట్ మీటింగ్ పెట్టి గవర్నర్ కు నివేదించాలన్నారు ఆయన.

కమీషన్ సభ్యులు వెంటనే తప్పు ఒప్పుకొని గన్ పార్క్ వద్ద క్షమాపణ కోరి సిట్ అధికారులకు లొంగిపోవాలన్నారు ఆయన. బిఎస్పి కి వందలాది ఫోన్లు చేస్తున్నారు అభ్యర్థులు. కేటిఆర్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పి ఆర్ ఓ గా వ్యవహరిస్తున్నారు. ఎవరికి తెలియని సమాచారం కెటి ఆర్ కు ఎక్కడిది?  భావ సారూప్యత ఉన్న అన్ని పార్టీలను కలుపుకొని విద్యార్థుల కోసం పోరాడుతాం అన్నారు ప్రవీణ్ కుమార్.

పర్మీషన్ ఇవ్వకపోయినా కాలేజి గేట్ ముందు కార్యక్రమం నిర్వహించి విద్యార్థులను చైతన్యం చేస్తామన్నారు ఆయన. 15 ప్రశ్నాపత్రాలు లీక్ అవడానికి కారకులు ఎవరో జనార్దన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు కూడా నిరుద్యోగ యువకుల పక్షాన ఉంటారో, దొంగల పక్షాన ఉంటారో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జన సమితి లాంటి కలిసొచ్చే పార్టీలన్నింటినీ కలిపుకొని విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థుల కోసం పోరాడుతామన్నారు ఆయన.

రాజోలిలో పాదయాత్రలో..

బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా శాంతినగర్, రాజోలిలో బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. రాజోలిలో కనీసం స్మశానవాటిక లేదు. నదిలో ఇసుకలో పూడ్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు ఈ సమస్యను నెరవేర్చకపోవడం దారుణం. గ్రామాలకు రోడ్లు లేవు, దీనిని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పట్టించుకోక పోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు ఆయన.

కెసిఆర్ తన ఫాంహౌస్ కు నీరు రావడం కోసం 1891 కోట్లు ఖర్చు చేసి కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మించుకున్నారు. కానీ అలంపూర్ నియోజకవర్గంలో 2 లక్షల ప్రజల కోసం తుమ్మిల్ల ప్రాజెక్టు కోసం 800 కోట్లు కేటాయించి కేవలం 300 కోట్లు విడుదల చేశారు. కేవలం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, డబ్బు పంచి ఓట్లు వేసుకోవడానికి కుట్రలు చేస్తున్నారన్నారు ఆయన. ఏప్రిల్ 9వ తేదీన అలంపూర్ చౌరస్తాలో 50 కంపెనీలతో మెఘా జాబ్ మేళా నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందికంటి విజయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు కేశవరావు,నియోజకవర్గ ప్రధానకార్యదర్శి రవిచందర్,మండల అధ్యక్షులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking