Take a fresh look at your lifestyle.

తిరుమలలో బ్రేక్‌ దర్శనాలకు విఐపిలు సిఫారసు లేఖలు తగ్గించాలి

0 162

ఏప్రిల్‌ 1 నుండి నడకమార్గాల్లో ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్లు

– వేసవి రద్దీ నేపథ్యంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం

– బ్రేక్‌ దర్శనాలకు సిఫారసు లేఖలు తగ్గించాలని విఐపిలకు విజ్ఞప్తి

– మీడియా సమావేశంలో టిటిడి ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి

తిరుమల, మార్చి 28 : భక్తుల కోరిక మేరకు ఏప్రిల్‌ 1వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటు అలిపిరి మార్గంలో 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 5 వేల దివ్యదర్శనం టోకెన్లు మంజూరు చేస్తామని, ఆ తరువాత భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని టిటిడి ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి వెల్లడిరచారు.

తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్‌ మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమలలో రానున్న వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఏర్పాట్లను తెలియజేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

– ఏప్రిల్‌ 15 నుండి జులై 15వ తేదీ వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కావున సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విఐపి బ్రేక్‌, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300/` దర్శన టికెట్లు తగ్గించనున్నాం.

– ఈ మూడు నెలల పాటు విఐపిలు సిఫారసు లేఖలను తగ్గించాలని కోరడమైనది.

– తద్వారా సామాన్య భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరితగతిన దర్శనం కల్పించడానికి అవకాశం కలుగుతుంది.

– ఆలయ మాడ వీధులు, భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో భక్తులకు కాళ్లు కాలకుండా కూల్‌ పెయింట్‌ వేస్తాం.

– తిరుమలలో 7500కు పైగా గదులు ఉన్నాయి. వీటిలో 40 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉంది. దాదాపు 85 శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయించడం జరిగింది. ఇటీవల ప్రవేశపెట్టి ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ ద్వారా గదుల కేటాయింపులో పారదర్శకతను పెంచడం జరిగింది.

– మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పాత అన్నదానం కాంప్లెక్స్‌, పిఏసి`2, 4తోపాటు నారాయణగిరి ఉద్యానవనాల్లోని క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో అన్నప్రసాదాలు పంపిణీ చేస్తాం.

– అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో జలప్రసాద కేంద్రాల ద్వారా భక్తులకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచుతాం. మెరుగ్గా పారిశుద్ధ్య ఏర్పాట్లు చేస్తాం.

– ప్రధాన కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టల్లో నిరంతరాయంగా సేవలందించేందుకు ఏర్పాట్లు.

– భక్తులకు కొరత లేకుండా తగినన్ని లడ్డూలు నిల్వ ఉంచుకుంటాం.

– టిటిడి విజిలెన్స్‌, పోలీసుల సమన్వయంతో భక్తులకు పార్కింగ్‌ సౌకర్యం కల్పించడంతోపాటు ట్రాఫిక్‌ సమస్య లేకుండా చూస్తాం.

– శ్రీవారి సేవకులతో వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందిస్తాం తెలియజేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking