Take a fresh look at your lifestyle.

చంద్రయాన్ 3 విజయం సాధనలో ఇస్రో సైంటిస్టుల్లో వెంకట్ కార్తీక్

0 13

చంద్రయాన్ 3 విజయం సాధనలో

ఇస్రో సైంటిస్టుల్లో వెంకట్ కార్తీక్

గోదావరిఖని (జ్యోతి నగర్), ఆగష్టు 23 : చంద్రయాన్ 3 విజయం సాధనలో ఇస్రో సైంటిస్టుల్లో వెంకట్ కార్తీక్ రామగుండం ఎన్ టి పి సి కి చెందిన సైంటిస్ట్, ఆయన తండ్రి సత్య ప్రసాద్ ఎన్టిపిసి సచ్ దేవా స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ స్కూల్లో తెలుగు పండిట్, ఇస్రో సైంటిస్ట్ గా కొనసాగుతున్న వెంకట కార్తీక్ ఎన్టిపిసి లోని పూర్వ చిన్నమయ్య విద్యాలయంలో పదవ తరగతి వరకు చదివాడు.

ఇక్కడి నుండి హైదరాబాద్ సిబిఐటిలో ఈసీఈ ఇంజనీర్ చదివాడు. అనంతరం బెంగళూరులో ఐఐ ఎస్ ఈ చేసి గేట్ ఆల్ ఇండియా లో 22వ ర్యాంకు సాధించారు అనంతరం శ్రీహరికోట నాసాలో సైంటిస్ట్ గా చేరి అప్పటినుండి అనేక ప్రయోగాలు చేస్తూ నేటి చంద్రయాన్ 3 విజయంలో కూడా పనిచేశాడు. చంద్రయాన్ 3 విజయంలో భాగస్వాములైన తన కొడుకు వెంకట్ కార్తీక్ పాల్గొనడం తనకు ఆనందయాయంగా ఉందని తండ్రి సత్యప్రసాద్ తల్లి రమాదేవిలు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking