Take a fresh look at your lifestyle.

వరవరరావు సార్.. విష్ యు హెప్పి బర్త్ డే

0 15

వరవరరావు సార్..

విష్ యు హెప్పి బర్త్ డే

అతని మాటలు తుపాకి తూటలుగా పేలుతాయి.. అతని కవిత్వం మందు పాతరలా విద్వంసం సృష్టిస్తాయి.. అతని ఉపన్యాసం వేలాది మంది మదిలో ఆలోచనలు చెలరేగుతాయి. అతనే వరవరరావు..  విరసం వరవరరావుగా పిలువబడే ఆ ఎనభై మూడేళ్ల యంగ్ బాయ్ కు విష్ యు హెప్పి బర్త్ డే చెబుదాం.

 

వరవరరావు నిలువెత్తు అక్షరం.. అతనికి ఊహ తెలిసిన నుంచే ఒక మానవుడిని మరో మానవుడు దోపీడి చేయని వ్యవస్థ కావాలని పోరాటం చేసే వారి కోసం కలాన్ని కత్తిలా మలిచి ఈ దోపీడి వర్గాలపై ఎక్కు పెట్టారు. కానీ.. ఈ బూర్జువ వర్గాలు అతనిపై కేసులు పెట్టి మహారాష్ట్రలోని జైలులో బంధించారు.

ఆశయం ముందు మీ నిర్బంధం ఎంత..? అంటూ జైలు గోడల నుంచి విప్లవ కవిత్వం రాస్తున్నారు వరవరరావు. తుపాకి తూటాలకు ఎదురు వెళ్లి శతృవులకు గుండె చూపిన వీరుడు వరవరరావు నేటి యువతరంకు ఆదర్శంగా నిలుస్తారు.

వరవరరావు పేరు వింటెనే దోపీడి ముఠాల గుండెల్లో గుబులు.. బూర్జువ పార్టీలకు వణుకు.. అతని ఉనికి లేకుండా ఉండటానికి ఏళ్ల తరబడి జైలు గోడల మధ్య పెట్టారు.

వరవరరావు సార్ ప్యామిలీ మెంబర్స్ తో…

సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్ రజాహుస్సేన్ మాటల్లో..

స్వేచ్ఛగా బతకాల్సిన ప్రజాస్వామ్యంలో మనిషి రెక్కలు  ఊడబెరికి  నిర్దాక్షణ్యంగా  కటకటాలవెనక్కు తోసేస్తున్నారు. మనిషి హక్కులకు పాత రేస్తున్నారు. రాజ్యాధికారం మదమెక్కి వీరంగం వేస్తోంది. అక్షరాలకు సంకెళ్ళు వేసి చోద్యం చూస్తోంది. ఈ దుర్మార్గాన్ని, దుష్ట పరిణామాన్ని వరవరరావుగారు 1974లోనే ఊహించారు. అప్పడే బాధలు అనుభవించారు కూడా..!!

స్వరాజ్యం అంటే..నల్ల దోపిడీ అని..  ప్రజాస్వామ్య మంటే పోలీసు రాజ్యమని..  సెక్యులరిజం జాతీయ దురహంకారమని..  సోషలిజం సామ్రాజ్య వాదం ముద్దు పేరని..

ఆగస్టు 15 రాకపోతే మాకు అర్థమయ్యేదే  కాదు..‌’!! (వివి…1974)

వరవరరావు గారికి జైలు గోడలు కొత్తేం కాదు. అప్పటి  ఏడు సంవత్సరాలు, ఇప్పటి రెండు సంవత్సరాలు.. కాలం ఏదైనా.. రాజ్య దురహంకారం మాత్రం ఒకటే. అయితే.. జైలు గోడలు వరవరరావును  భౌతికంగా  అయితే ‌మూయ  గలిగాయి. కానీ.. ఆయన  సృజనను మాత్రం అడ్డుకోలేకపోయాయి. అక్షరాలను చెరపట్టలేక  చతికిల పడ్డాయి. జైలు గోడలను పరిహసిస్తూ ఆయన భావప్రకటన, వ్యక్తీకరణ నిరాఘాటంగా సాగుతూనే ఉన్నాయి.

ఇంతకూ.. జైల్లో కవులేం చేస్తారు ?  కటకటాల్ని ధిక్కరిస్తారు. ధిక్కరించిన దేహాల్ని రేపటి విముక్తి పతాకాలుగా ఎగరేస్తారు. జనం  పైకెత్తే ఓ పిడికిలినిస్తారు.

ఎప్పటి లాగే రాజ్యం తన చేతులకు వేసిన సంకెళ్ళ చేతులతో  కవి కవితను రాస్తాడు. ఆ కవితను‌ స్వేఛ్ఛకు అంకితమిస్తాడు. “ఫర్వాలేదు… జైళ్లు బయళ్ళవుతాయి. బయళ్లు అంటుకున్న అడవులవుతాయి. అడవులు పట్నాల పక్కటెముకులవుతాయి. పక్కటెముకులు ప్రతీ ఒక్కరిలో కవిత్వపు కాగడాలవుతాయి.”(కాంతి నెల్లూరి )

వివి “నిలువెత్తు అక్షరం…!!

వివి (వరవరరావు ) కేవలం రెండు అక్షరాలు అనుకుంటే పొరపాటే. ఆయనే నిలువెత్తు అక్షరం. అక్షర విస్ఫోటక శక్తి. విశ్రాంతి లేని వాక్యం. విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి బాగోటంలేదని కుటుంబ సభ్యులు మొత్తుకుంటున్నా.. రాజ్యానికి కనికరం లేకుండా పోయింది. కేవలం కుటుంబ సభ్యులే కాదు. ఎందరో ప్రజాస్వామ్య వాదులు, కవులు రచయితలు ‘ వరవర రావును విడుదల చేయాలంటూ  ఆందోళనచేస్తున్నారు. ప్రభుత్వాలను కోరుతున్నారు.

జైలు గోడవ వెనుక ఉన్న వరవరరావు వయస్సు ఎనభై మూడు.. అతని వయసు రీత్యా విడుదల చేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక, తెలంగాణ తరపున కన్వీనర్ ప్రొ.జి.హరగోపాల్  గారు తేదీ: 11-7-2020 నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ కు రాసిన లేఖ ఇదే..

గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం గారికి,

విషయం: సుప్రసిద్ధ కవి పి.వరవరరావు గారు మహారాష్ట్ర ముంబైలోని తలోజ జైలులో తీవ్ర అనారోగ్యంతో ఉన్నందున వారిని వెంటనే తగిన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి, అతని ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి*

◆◆◆

ఈరోజు మహారాష్ట్ర- ముంబై-తలోజ జైలు అధికారులు జైలులో విచారణలో ఖైదీగా ఉన్న వరవర రావు గారితో ఫోన్ చేయించి అతని సహచరి హేమలత గారితో మాట్లాడించారు. అప్పుడు వరవరరావు గారు మాట్లాడిన తీరు ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఒక విషయంలో మరో విషయం పొంతన లేకుండా ఉన్నదని, మాట మొద్దుబారి ఉన్నదని, ఆమె చాలా దుఃఖంతో మాకు తెలిపినారు. వారి కుటుంబం అంతా తీవ్ర ఆందోళనతో ఉంది.

ఈ పరిస్థితిలో మీరు జోక్యం కల్పించుకొని, తగిన చికిత్స కోసం వారి ఆరోగ్యం, ప్రాణాలు కాపాడటం కోసం వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలని కోరుతున్నాము. అలాగే వారు బెయిల్ పై విడుదలై, తన కుటుంబంతో కలిసి ఉండి, సరైన చికిత్స పొందే విధంగా మీరు తగిన సహకారం అందించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము.

మీ తోడ్పాటు కుటుంబ ఆందోళనను, తెలుగు సమాజంలోని సాహితీ మిత్రులు, ప్రజాస్వామిక వాదులు ఆందోళనను తగ్గించగలదని నమ్ముతున్నాము.

ధన్యవాదములతో ,

  ప్రొ.జి.హరగోపాల్, కన్వీనర్

నిర్బంధ వ్యతిరేక వేదిక, తెలంగాణ

అయినా.. వరవరరావు జైలు గోడల నుంచి ఇంకా విడుదల కాలేడు. కానీ.. కంటి ఆఫరేషన్ కోసం మాత్రం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది.

వరవరరావు సార్.. మీకు జన్మదిన శుభకాంక్షలు..

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking