Take a fresh look at your lifestyle.

హజ్ యాత్రికులకు వ్యాక్సిన్ పాల్గోన్న మంత్రి హరీష్ రావు

0 13

హజ్ యాత్రికులకు వ్యాక్సిన్

పాల్గోన్న మంత్రి హరీష్ రావు

హైదరాబాద్, మే 22 : హైదరాబాద్ నాంపల్లి హజ్ కార్యాలయంలో నిర్వహించిన వ్యాక్సినేషన్ క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీష్ రావు పాల్గొని.. హజ్ యాత్రకు వెళ్లేవారికి వ్యాక్సిన్ అందించారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీం, మైనార్టీస్ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారి ,ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ ,హెల్త్ కమిషనర్ శ్వేతా మహంతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మంత్రి మాట్లాడుతూ హజ్ యాత్రకు వెళ్ళే వారందరికీ నా శుభాకాంక్షలు. హజ్ యాత్రకు వెళ్లినప్పుడు మీకోసం మీ కుటుంబ కోసం ప్రార్థించడంతోపాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం కూడా ప్రార్థించాలి.

హజ్ యాత్ర నిర్వహణలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. హజ్ యాత్రకు వెళ్ళేందుకు అవసరమయ్యే అన్ని రకాల వ్యాక్సినేషన్లు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. హైదరాబాద్ లోనే కాకుండా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ వ్యాక్సినేషన్లను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. హజ్ యాత్రకు వెళ్ళేందుకు అని అన్ని సౌకర్యాలు తెలంగాణ ప్రభుత్వం మీకోసం చేస్తుంది. అన్ని వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేసే ఏకైక ప్రభుత్వం మనం కేసీఆర్ ప్రభుత్వం.

మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుంది. ది ముబారక్ తో పేదింటి మైనార్టీ ఆడబిడ్డలకు ఆర్థిక సహాయం అందించి వారి కష్టంలో పాలుపంచుకుంటున్నాం. మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రోజు తెలంగాణలో నిర్మించుకున్నాం. విదేశాలకు వెళ్లి చదివేందుకు మైనార్టీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ అందించి వారికి మెరుగైన భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీ పాటుపడుతుందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking