Take a fresh look at your lifestyle.

రైతన్నకు రెండు లక్షల రుణ మాఫీ చేస్తాo : రేవంత్ రెడ్డి

0 51

రైతన్నకు రెండు లక్షల రుణ మాఫీ చేస్తాo

-500 కే గ్యాస్ సిలిండర్ అందజేస్తాం
-తెలంగాణలో బిజెపి గెలిచేది లేదు
-వరంగల్ డిక్లరేషన్ అమలు చేస్తాం
-శ్రీరామునికి మాట ఇచ్చి మోసం చేసినోడు బాగుపడతాడా ?

-భద్రాచలం జనసభలో టి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫిబ్రవరి 15 : దక్షిణ అయోధ్యగా బాసిల్లిన భద్రాచలం ప్రాంతం బి ఆర్ఎస్ పార్టీ పాలన వలన నష్టపోయిందని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర భద్రాచలం కు చేరుకుంది. ముందుగా అంబేద్కర్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సభలో మాట్లాడారు. దేశ సమగ్రతను కాపాడేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర చేపట్టేరని ఆయన తెలిపారు.

గోదావరి వరద ముప్పు బాధితులను ఆదుకుంటానని పదివేల ఇస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు కాలేదని విమర్శించారు. శ్రీరాముడికి కనీసం తలంబ్రాలు ఇచ్చేందుకు కూడా కెసిఆర్ రాలేదని ఆరోపించారు. దేశంలో విభజించు పాలించు అనే విధానము బిజెపి పాలన కొనసాగుతుందన్నారు. శ్రీరాముడికి మాట ఇచ్చి మోసం చేసినోడు బాగుపడతాడా భద్రాచలం జన సభలో రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యేకనే ఏడు మండలాలను ఆంధ్రలో వీలినం చేశారని ఉన్నారు. భద్రాచలాన్ని కుట్టపూరితంగా మూడుముక్కలు చేశారని ఆరోపించారు. పినపాక నియోజకవర్గం లో రైతుల కష్టాలను చూసి చలించిపోయానన్నారు. సీతారామ ప్రాజెక్టు కోసం తీసుకున్న భూములకు ఇప్పటివరకు నష్టపరిహారం రైతులకు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదని రైతులు చెప్తున్నారని అని వాపోయారు. ట్రాన్స్ఫార్ములు కాలిపోతున్నాయని ఇబ్బంది పడుతున్నామని రైతులు తెలియజేశారు. నిత్యవసర ధరలు పెరగడంతో రోజు కూలికి నూనె ప్యాకెట్ కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రౌండ్లో కాంగ్రెస్ లేదని బిజెపి వాళ్లు పిచ్చి కూతల కోస్తున్నారని భద్రాచలం వచ్చి చూడండి అని అన్నారు. తెలంగాణలో బిజెపి గెలిచేది లేదని తెలిపారు.

ఇల్లు లేని ప్రతి పేదవాడికి 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని అన్నారు. కౌలు రైతులకు 15000 ఆర్థిక సాయం అందజేస్తామని, వరంగల్ డిక్లరేషన్ ప్రకారo రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పోడు భూములకు పట్టాలిచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని తెలిపారు. శ్రీరాముడుకి 100 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పిన సీఎం హామీ ఏమైందని సభలో ప్రశ్నించారు.

ఈ కార్యక్రమములో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ టీపీసీసీ అధ్యక్షులు హనుమంతరావు, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ మంత్రి బలం బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య ప్రసంగించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు, కొత్తగూడెం కాంగ్రెస్ నాయకులు ఎడవెల్లి కృష్ణ, భద్రాచలం నాయకులు బుడగం శ్రీనివాస్, మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగల శ్రీనివాస్ రెడ్డి, ,నల్లపు దుర్గాప్రసాద్, ,పట్టణ అధ్యక్షులు నరేష్, సతీష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking