Take a fresh look at your lifestyle.

కేరళ రాష్ట్రంలో పర్యాటించిన టీటీడీ అధికారులు

0 12

కొల్లం ఆయుర్వేద సంస్థలను పరిశీలించిన టీటీడీ అధికారులు

తిరుపతి, జూన్ 1 : కేరళ రాష్ట్రం లోని ప్రముఖ ఆయుర్వేద ఆసుపత్రులు, కళాశాలలు, ఫార్మసీ ల నిర్వహణ విధానాలను అధ్యయనం చేస్తున్న టీటీడీ అధికారుల బృందం బుధవారం కొల్లం లోని అమృత ఆయుర్వేద ఆసుపత్రి, కళాశాల, ఫార్మసీ, పరిశోధనాలయాన్ని సందర్శించింది. టీటీడీ జేఈవో సదా భార్గవి, సిఏవో శేషశైలేంద్ర, ఆయుర్వేద ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్ బృందం మూడు రోజులుగా కేరళలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థ నిర్వహిస్తున్న పరిశోధన కేంద్రం,ఆసుపత్రి, ఫార్మసీని పరిశీలించి వారు అవలంబిస్తున్న విధానాలపై అక్కడి అధికారులతో చర్చించారు. ఓపీ, ఇన్ పేషేంట్ సేవలు అందిస్తున్న విధానం గురించి అక్కడి అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయుర్వేద కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న ఉచిత వైద్యం, రుసుము వసూలు చేసి అందిస్తున్న వైద్య సేవల వివరాలు తెలుసుకున్నారు.

ఇక్కడి ఆయుర్వేద పరిశోధన కేంద్రంలో ఏ మందులు తయారు చేస్తున్నారు. ఏ మందులకు ఎక్కువ డిమాండ్ ఉంది అనే వివరాలు తెలుసుకున్నారు. ఫార్మసీ నిర్వహణ , మందుల మార్కెటింగ్ విధానాల పై చర్చించారు. అనంతరం టీటీడీ అధికారులు ఆసుపత్రి డీన్ డాక్టర్ శంకర్ అమృతానంద పురి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్, రీసర్చ్ హెడ్ డాక్టర్ రాం మనోహర్, టీటీడీ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్ధి, ఆ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ వినీత్ తో
కలసి వివిధ అంశాలపై చర్చించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking