Take a fresh look at your lifestyle.

ఉస్మానియా అధ్యాపకుల సమస్యల పరిష్కారం దిశగా..

0 164

ఉస్మానియా విశ్వవిద్యాలయం : దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఉస్మానియా అధ్యాపకుల సమస్యల పరిష్కారం దిశగా మరో ముందడుగు పడింది. ప్రొఫెసర్ జి. మల్లేశం నేతృత్వంలోని ఉస్మానియా యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్ ఔటా బృందం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుతో భేటీ అయింది.

సీపీఎస్ అమలు లేదా ఓల్డ్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించటం చేయాలని ఈ సందర్భంగా హరీష్ రావుకు విజ్ఞప్తి చేశారు. ఏళ్లుగా అధ్యాపకులు పెన్షన్ విషయమై ఆందోళనకు గురవుతున్నారని…. వెంటనే సీపీఎస్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ విషయమై సానుకూలంగా స్పందించిన మంత్రి ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రానున్న బడ్జెట్ లో సీపీఎస్ పెన్షన్ బడ్జెట్ కు సంబంధించిన కేటాయింపులు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పటం పట్ల అధ్యాపకుల బృందం మంత్రికి కృతజ్ఞతలు తెలిపింది.

సంవత్సర కాలంగా తాము చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు చివరి దశకు చేరాయని ఈ సందర్భంగా ఔటా ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ జి. మల్లేశం ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే ఉస్మానియా అధ్యాపకులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కానున్నయని స్పష్టం చేశారు.

ఆర్థిక శాఖా మంత్రి హరీశ్ రావును కలిసిన వారిలో…. ఔటా ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ జి. మల్లేశంతో పాటు ఔటా మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు ప్రొఫెసర్ సరస్వతమ్మ, ఔటా కోశాధికారి డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు, ఔటా సహాయ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణ, సీపీఎస్ సాధన సమితి నుంచి డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్, ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్, ప్రొఫెసర్ మంగు, డాక్టర్ సాధన, డాక్టర్ నర్సింహ్మ, డాక్టర్ బి. రవిందర్ రెడ్డి ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking