Take a fresh look at your lifestyle.

సీఎం సార్ కు.. గవర్నర్ మేడంకు మళ్లా గొడవ ముదిరింది..

0 15

సీఎం సార్ కు.. గవర్నర్ మేడంకు
మళ్లా గొడవ ముదిరింది..

‘‘ఓరేయ్.. గీ ముచ్చట విన్నావా..?’’ అన్నాడు విలేకరి మల్లిగాడు.
‘‘అగో.. గా ముచ్చటెదో చెప్పకుండా విన్నావా..? అంటే ఎట్లా..?’’ అడిగిండు వెంకటి గాడు.
‘‘సీఎం సార్ కు.. గవర్నర్ మేడంకు మళ్లా గొడవ ముదిరింది..’’ అన్నాడు మల్లిగాడు.
‘‘నీ పిచ్చి గాని.. గాళ్ల నడుమ గొడవ లేందెప్పుడో చెప్పు. గాళ్ల మధ్య పచ్చగడ్డి కోచుకచ్చి వేత్తే కూడా అగ్గి అంటుకుంటుందనేది అందరికి తెలిసిన ముచ్చటెనా గదా..?’’ అన్నాడు వెంకటి గాడు.
‘‘మొన్న మంత్రి మండలి గవర్నర్ కోటా కింద ఇద్దరు ఎమ్మెల్సీలను నామినేట్ చేయుమని కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ పేర్లు పంపిండ్రి గదా.. గాళ్లకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వలేనని గవర్నర్ మేడం ఆ ఫైల్ ను ఉల్టా పంపింది.’’ అన్నాడు మల్లిగాడు.
‘‘అయినా.. గా గవర్నర్ మేడం సీఎం సార్ పంపిన ఫైల్ ఎప్పుడైనా బాగుందని ఒకే చేసిందా..? చేయలేదు గదా.. ఇంతకు ఫైల్ ను తిప్పి పంపడానికి కారణం చెప్పిండచ్చు గదా.. ఏమైందట..’’ అడిగిండు వెంకటి గాడు.
‘‘సీఎం సార్ మంత్రి మండలి నామినేటెడ్ కోటా కింద సిఫార్సు చేసిన కుర్రా సత్యనారాయణ, దాసోజు గాళ్లిద్దరికి తగిన అర్హతలు లేవని గవర్నర్‌ పేర్కొంది. ఆర్టికల్ 171 (5) ప్రకారం అర్హతలు సరిపోవని తమిళిసై చెప్పేసింది. అంతకు ముందు కూడా హుజురాబాద్ ఏరియాకు చెందిన పాడి కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని పంపితే గిట్లనే తిరిగి పంపింది. గప్పుడు సీఎం గాయినకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు. ’’ చెప్పిండు మల్లిగాడు.
‘‘గీళ్ల కొట్లాట జూత్తుంటే గవర్నర్ – సీఎం మధ్యన గొడవలాగా లేదు. కేంద్రం- రాష్ట్రం మధ్యన ఉన్నట్లనిపిత్తాది.. సరే గాళ్లది ఒడువని ముచ్చట..’’ అని ఇద్దరు ఇంటికి వెళ్లి పోయిండ్రు.

  • తీస్ మార్కన్ మల్లిగాడు

Leave A Reply

Your email address will not be published.

Breaking