Take a fresh look at your lifestyle.

నారాయణ ఖేడ్ నియోజక వర్గంలో త్రిముఖ పోటీ

0 18

నారాయణ ఖేడ్ నియోజక వర్గంలో త్రిముఖ పోటీ

  • కాంగ్రెస్ లో టికెటు కుమ్ములాటలు..
  • బీఆర్ఎస్ కు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో దెబ్బ..
  • జర్నలిస్ట్ జెనవాడే సంగప్పకు కలిసొస్తుందా..?

సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజక వర్గంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య నువ్వా నేనా అనే రీతిలో కొనసాగుతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఈ ప్రాంతం అభివృద్దికి నోచుకోక పోవడానికి పాలకుల నిర్లక్షం ప్రధానంగా కనిపిస్తోంది. సమస్యలను పట్టించుకోని పాలకుల నిర్లక్షంను టార్గెట్ గా చేసుకుని బీజేపీ అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్ట్ జెనవాడ సంగప్ప పోటీ చేయడం చర్యానీయంశంగా మారింది.

నారాయణ ఖేడ్ ప్రాంతంలో అన్నీ సమస్యలే..

నారాయణ ఖేడ్ ప్రాంతంలో అన్నీ సమస్యలే స్వాగతం పలుకుతాయి. అందుబాటులో లేని విద్య, రోగం వచ్చిన మెరుగైన వైద్యం లేక ఆవస్థలు పడే ప్రజలు.. తాండవిస్తున్న నిరుద్యోగంతో వలసలు పోయే బతుకులు.. బ్రతుకు తెరువు లేక ఇతర ప్రాంతాలకు పనుల కోసం వెళుతున్న జనం.. తాగు నీరు, సాగు నీటి సమస్య, ఆధ్వాన్నమైన రోడ్లు, ఆదరణ కొల్పోయిన దేవాలయాలు నారాయణ ఖేడ్ ప్రాంతంలో అడుగడుగున అగుపించే సమస్యలు.

జర్నలిజంకు గుడ్ బై చెప్పి.. రాజకీయాలలోకి..

జెనవాడే సంగప్ప.. ఇరువై ఏళ్లుగా జర్నలిస్ట్ గా పని చేసిన అనుభవం అతని స్వాంతం.. స్టేట్ లో ఉన్న సమస్యలపై జర్నలిస్ట్ గా ఫోకస్ చేసి పరిష్కారించినవి ఎన్నో. ప్రత్యేకంగా ఇంటార్వ్యూలు చేసి సమస్యలను నిలదీసిన ఘనత సంగప్ప జర్నలిజం వృత్తిలో ఎన్నో ఉంటాయి. సంగప్ప జర్నలిజంకు గుడ్ బై చెప్పి ప్రజా సేవ చేయాలని నారాయణ ఖేడ్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన అతను పాలకుల నిర్లక్షంపై ఫోకస్ పెట్టారు. తరతరాలుగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కారించి నారాయణ ఖేడ్ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని కంకణం కట్టుకున్నారు.

సంగప్ప జీవిత ప్రస్థానం..

సంగప్ప… నారాయణ ఖేడ్ నియోజక వర్గంలోని చౌకన్ పల్లి గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఇరువై ఏళ్లుగా జర్నలిస్ట్ గా పని చేస్తూ సెలబ్రిటి హోదాను కూడా వదిలి నారాయణ ఖేడ్ ప్రాంతానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. లక్షా రూపాయల పైననే ఉండే వేతనం వదిలి తాను పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలని సంగప్ప నిర్ణయించుకున్నారు.

ఎన్నికలలో దూసుకు పోతున్న సంగప్ప..

నారాయణ ఖేడ్ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి జెనవాడ సంగప్పకు రాజకీయాలు కలిసి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సురేష కుమార్ షెట్కర్, సంజీవ రెడ్డిల మధ్య టికెటు వివాదం, బీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డికి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో బీజేపీకి కలిసొస్తున్నాయి. ముఖ్యంగా మారిన రాజకీయ సమీకరణలలో కాంగ్రెస్ కు మంచి పట్టుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవరెడ్డికి మంచి పేరుంది. అయితే.. అతనికి కాదని సురేష్ కుమార్ షెట్కర్ కు టికెటు ఇవ్వడంతో ఆ పార్టీకి నష్టం జరుగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ కుమ్ములాటలు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో బీజేపీకి కలిసి వస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

జనవాడే సంగప్ప హామిలు ఇవే..

  • దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 ఏళ్లు గడిచిన మన నారాయణ ఖేడ్ నియోజక వర్గంలో వైద్య సహాయం లేదు. ప్రతి ఒక్కరికి క్లిష్టమైన ఆరోగ్య సమస్యలు వచ్చిన ఉచితంగా వైద్యం అందిస్తాం.
  • ప్రతి మండలానికి అంబులెన్స్ ఏర్పాటు చేసి సత్వర వైద్యం అందించే ఏర్పుటు చేస్తాం..
  • నారాయణ ఖేడ్ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యతో హైదరాబాద్ తో సహా ఇతర నగరాలకు వలస పోతున్న యువతను పాలకులు పట్టించుకోలేరనేది నిజం. ఆ యువత కోసం పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్దం చేసాం..
  • నారాయణ ఖేడ్ లో ఇండస్ట్రియల్ హబ్ కోసం ప్రయత్నం చేసి వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనేది మా లక్ష్యం.
  • నారాయణ ఖేడ్ నియోజక వర్గంలోని ఏ ఊళ్లేకు వెళ్లినా.. తాండాలకు వెళ్లినా గతుకుల రోడ్లు స్వాగతం పలుకుతాయి. అందుకు కారణం..? మాజీ పాలకులే.. ప్రతి పల్లెకు, తాండాకు కొత్తగా నాణ్యమైన రోడు నిర్మాణం చేస్తాం..
  • నారాయణ ఖేడ్ నియోజక వర్గం చుట్టూ సింగూర్ ప్రాజెక్ట్, నిజాం సాగర్ ప్రాజెక్ట్, కౌలాస్ నాల లాంటి ఇంకెన్నో రిజార్వాయరులు ఉన్నప్పటికీ తాగు, సాగు నీటి వసతి లేక ప్రజలు ఆవస్థలు పడటానికి కారణం మీకు తెలుసు.. తప్పకుండా నియోజక వర్గంలో సాగు, తాగు నీటి సదుపాయం కల్పిస్తాం..
  • సంగమేశ్వర ప్రాజెక్ట్, బసమేశ్వర ప్రాజెక్ట్ ల నిర్మాణం హామిలు పాలకుల నిర్లక్ష్యాన్ని ఎక్కిరిస్తున్నాయి. మీ ఆశీర్వాదంతో తప్పకుండా ఆ ప్రాజెక్ట్ లు పూర్తి చేసి వేలాది ఎకరాలకు సాగు నీరు అందిస్తాం..
  • ప్రధాని మోదీ సహాకారంతో కేంద్రియ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తాం..
  • కేంద్ర ప్రభుత్వం నిర్మించిన 161 జాతీయ రహదారి వల్ల నారాయణ ఖేడ్ అభివృద్దికి బాటలు వేస్తాం. నిజాంపేట నుంచి నారాయణఖేడ్ మీదుగా బీదర్ జాతీయ రహదారిని వేగవంతంగా పూర్తి చేస్తాం.
  • నిజాంపేట మీదుగా మంజూరైన రైలు మార్గం త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తాం.
  • జాతీయ రహదారులు, రైల్వే మార్గాలను పూర్తి కాగానే నారాయణ ఖేడ్ ను ఇండస్ట్రియల్ హబ్ గా మారుస్తాం..

Leave A Reply

Your email address will not be published.

Breaking