Take a fresh look at your lifestyle.

ఈ పోలీసోడు పెళ్లాన్ని కొట్టుడేంది..?

0 14

ఈ పోలీసోడు పెళ్లాన్ని కొట్టుడేంది..?
నిర్దేశం, అసిఫాబాద్ :
పోలీసు.. తప్పు చేసినోళ్లను శిక్షేంచే సర్కార్ కొలువు. అన్నీ తెలిసినోడు భార్యను బాగ చూసుకుంటాడనుకుంటారు. అలా అనుకుని పెళ్లి చేసిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ఆయన్ను పెళ్లి చేసుకుంటే అమ్మాయి జీవితం సుఖంగా ఉంటుందని భావించారు కుటుంబ సభ్యులు. అందులోనూ ఆయనది పోలీస్ ఉద్యోగం కావడంతో పెళ్లికి 20 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. అయిన వేధింపులు తప్పలేదు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పొలీస్ హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తున్న మాధవ్ రావు తన భార్యని విచక్షణ రహితంగా కొట్టడంతో ఆమెకు తీవ్ర గాయలయ్యి ఆస్పత్రి పాలయ్యింది. తన భార్యా అయన మౌనిక పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. డబ్బులు విషయంలో పలు మార్లు గోడవపడ్డారు.

కొడుకు ఫంక్షన్ కోసం 2లక్షల విషయంలో ఇద్దరి మధ్య వివాదం మరింత పెరిగింది,
గ్రూప్స్ ప్రిపేర్ కోసం తన ఉద్యోగానికి ఆరు నెలలు సెలవు పెట్టున్నాడు.. ఆరు నెలలు నాకు జీతం రాదు కాబట్టి 6 నెలల రూం రెంట్ నువ్వ కట్టాలని భార్యను వేధించేవాడనీ,..మాధవరావు అక్రమ సంబంధం పెట్టుకున్నారని భార్య మౌనిక ఆరోపించింది. ఇంట్లో నిత్యావసర సరుకులు, బాబుకి పాలు డబ్బా కూడా తీసుకొచ్చే వాడు కాదని, ఇద్దరు మధ్య జరిగిన వాగ్వాదంలో కానిస్టేబుల్ మాధవ్ రావు తన భార్యను రాడ్ తో వీపు పై కొట్టడంతో ఆసుపత్రిలో చేరింది. చివరకు మౌనిక పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking