Take a fresh look at your lifestyle.

ఈ సదాశివరెడ్డి జీవితం నాశనం చేసిన తీవ్రవాదులు..

0 571

ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడు ఎవరి జీవితం ఎటు టర్న్ అవుతుందో ఎవరికి తెలియదు.

ఇంట్లో నుంచి బయటకు వెళ్లి క్షేమంగా తిరిగి వస్తామనే గ్యారంటీ లేని జీవితం మనది.

తప్పు చేయక పోయిన కొందరు జీవితాంతం శిక్ష అనుభవించాల్సిన పరిస్థితులు.

తీవ్రవాదులకు అడ్డగా మారిన హైదరాబాద్ లో పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా.. దేశంలో ఎక్కడ తీవ్రవాదులు అరెస్టు అయినా దాని మూలాలు హైదరాబాద్ తో లింక్ ఉంటుంది. 

పదిహేనేళ్ల క్రితం గోకుల్ చాట్ వద్ద తీవ్రవాదులు పేల్చిన బాంబులతో  ఎందరో మరణించారు.

మరి కొందరు అవిటి వారయ్యారు. ఆ బాంబు దాడిలో గాయపడి బతుకు జీవుడా అంటూ కాలం వెళ్ల తీస్తున్న సదాశివరెడ్డి జీవితం ఇది.

ఎర్రని టీ షర్ట్… నల్లని పాయింట్.. చేతిలోనడువడానికి కర్ర.. నడువ లేక నడుస్తున్న ఈ  యువకుడికి ఎంత మందికి గుర్తు ఉన్నాడో నాకు తెలియదు.  

కానీ నేను మాత్రం మర్చిపోలేను..

పేరు సదాశివరెడ్డి నాలుగు రోజుల్లో విదేశాలకు వెళ్లి కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్దపడిన యువ ఇంజినీర్.

2007లో ఆసియాలోనే అత్యంత నైపుణ్యంగల ఇంజనీర్ గా విదేశాల్లో మంచి ఉద్యోగం సాధించాడు. 

లుంబినీవనంలో రాత్రి ఏడున్నరకు లేజర్‌షో మొదలైంది.

దాదాపు 500 మంది వరకు సందర్శకులు దాన్ని చూస్తున్నారు.

వందేమాతర గీతాలాపన అప్పుడే పూర్తయింది.

‘గుడ్‌ ఈవినింగ్‌ హైదరాబాద్‌’ అంటూ స్వాగత వచనం!

అప్పుడు సీట్ల మధ్యలో బాంబు పేలింది.

కుర్చీలు గాల్లో తేలాయి. తలలు ఎగిరిపడ్డాయి. శరీర అవయవాలు, మాంస ఖండాలు చెల్లాచెదురుగా పడ్డాయి.

సందర్శకులంతా భయంతో పరుగులు తీశారు.

దీంతో తొక్కిసలాట జరిగింది. కుర్చీలు చెల్లా చెదురయ్యాయి.

పేలుడు ధాటికి ఘటనా స్థలిలోనే ఇద్దరు చనిపోగా, మరో ఏడుగురు ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. 40-50 మంది వరకు గాయపడ్డారు

గోకుల్_చాట్ వద్ద మరణ హోమంతో 33 మంది మృతి.. 50 మందికి గాయలు..

సదాశివ్ రెడ్డి దురదృష్టవశాత్తు హైదరాబాద్ గోకుల్_చాట్ వద్ద 2007లో ఉగ్రవాదులు చేసిన మారణ హోమం కారణంగా మెదడులో ఇనుప ముక్కలు తగలడంతో ఇలా జీవచ్చంగా మారిపోయాడు.

అవలీలగా 5,6 భాషలు(#జపనీస్ కూడా) మాట్లాడే వ్యక్తి ఇప్పుడు

కేవలం ‘‘అమ్మా..’’ అనే మాట తప్ప ఇంకేం మాట్లాడలేకుండా అయిపోయాడు.

 15 ఏళ్ళు అయిన ఆ ఉదంతం ఈ కుటుంబానికే కాదు చాలా కుటుంబాలకు  తీరని శోకం మిగిల్చింది.

వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడు అనుకున్న కొడుకు ఇలా కళ్ళ ముందు బ్రతికి ఉన్న శవం లా తిరుగుతుంటే తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో ఊహించుకోండి. అమ్మనో.. నాననో సహాయం లేకుండా నడువలేని దీనస్థితి సదాశివ్ రెడ్డిది.

కంప్యూటర్ యుగంలో తీవ్రవాదుల కార్యకలపాలను ఇట్టే పట్టుకుంటున్నారు పోలీసులు.

ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా తీవ్రవాదులు మరణహోమం సృష్టించడానికి ప్రయత్నం చేసిన సమయంలో పోలీసు అధికారుల బృందం తీవ్రవాదులను అరెస్ట్ చేసి పెను ప్రమాదంను తప్పించింది.

దేశ వ్యాప్తంగా ఎన్ఐఎ బృందం కూడా తీవ్రవాదులను తెల్లవారు జామున దాడులు చేసి అరెస్టు చేశారు.

తీవ్రవాదులతో సవాల్ చేస్తూ వారి కార్యకలపాలను అణిచి వేస్తున్న ఆర్మీ.. బిఎస్ ఎఫ్.. సిఆర్ పిఎఫ్.. సీఐడి.. ఇంటిలిజెన్స్.. పోలీసులకు సెల్యూట్ చేయాల్సిందే.

పబ్లిక్ లో ఉగ్రదాడులు జరగకుండా అనేక రక్షణ చర్యలు చేపట్టారూ,
సదాశివరెడ్డి జీవితంలా మరొకరి జీవితం కాకూడదని బీజేపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఎంతో పటిష్టమైన భద్రతతో పరిపాలన సాగిస్తున్నది
ఈ సదాశివరెడ్డి గారి జీవితంలా మరొకరి జీవితం అవ్వకుండా చూస్తుంది ప్రభుత్వం.
ఆ కుటుంబం అనుభవిస్తున్న క్షోభ మరొక కుటుంబం అనుభవించకుండా పోలీసు యంత్రంగం ప్రయత్నిస్తోంది.

సేకరణ : బింగి శ్రీకాంత్

 

Leave A Reply

Your email address will not be published.

Breaking