Take a fresh look at your lifestyle.

కెసిఆర్ సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదు : ఎమ్మెల్సీ కవిత

0 13

కెసిఆర్ సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదు

కాంగ్రెస్ నేతలకు కల్వకుంట్ల కవిత సవాల్

నిజామాబాద్, జూన్ 8 : తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందని ఇల్లే లేదని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఏం చేశారని సంబరాలు జరుపుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు ఇంటింటికి తిరిగి ఫలాలు ఎలా అందుతున్నాయో చూడాలని సవాల్ విసిరారు. మంచి పనులు చేయడంలో దేశానికి తెలంగాణ ఉదాహరణగా నిలిచిందని తెలిపారు.

మిషన్ కాకతీయ పథకాన్ని కాపీ కొట్టిన కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ పేరిట అమలు చేస్తున్న కార్యక్రమం విఫలమైందని, ఆ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం కారణంగా దేశంలో చెరువులు బాగవ్వడం లేదని విమర్శించారు.తెలంగాణ దశాబ్ది ఉత్సవంలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి లో జరిగిన చెరువుల పండుగ లో స్థానిక ఎమ్మెల్యే షకీల్ తో కలిసి కవిత పాల్గొన్నారు.

చెరువులను బాగు చేయాలన్నదానికి వెనుక కారణమేంటన్నది ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడకముందు 75 ఏళ్ల క్రితం చెరువులు నిండుకుండలా ఉండేవని, ప్రజల జీవితమంతా చెరువు చుట్టే ఉండేదని గుర్తు చేశారు.చెరువు బాగుంటే ఊరు ఊరంతా చెరువుపై ఆధారపడి బ్రతికే పరిస్థితి అని తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంలో అయినా చెరువు, నది ఉంటే ఆ సంస్కృతి, జనజీవితం వాటిపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా రూ. 5 వేల కోట్ల వ్యయంతో 47 వేల చెరువులను మరమ్మత్తు చేసుకున్నామని చెప్పారు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను రక్షించాలన్నది ప్రభుత్వ ఉద్ధేశమని, అవి ఎప్పటికీ ఎండిపోవద్దన్నది సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద దాదాపు 20 వేల చెరువులను నింపుతున్నామని, కాబట్టి ఎండకాలంలోనూ రాష్ట్రంలో చెరువుల ఎండిపోవడం లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని తెలిపారు. చెరువుల మరమ్మత్తు కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని, అమృత్ సరోవర్ పేరిట దేశమంతా బీజేపీ ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని చెప్పారు. కానీ మనం చేస్తున్నదానిలో 10 పైసల మందం కూడా కేంద్రం ఆ కార్యక్రమానికి డబ్బులు ఇవ్వడం లేదని, దాని వల్ల చెరువులు బాగవ్వడం లేదని విమర్శించారు. దాదాపు 12-13 రాష్ట్రాల్లో చెరువుల మరమ్మత్తు కార్యక్రమం జరుగుతుందని ప్రస్తావించారు. అంటేమంచి పనులు చేయడంలో దేశానికి తెలంగాణ ఉదాహరణగా మారిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో జెడ్పీ ఛైర్మెన్ విఠల్ రావు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking