Take a fresh look at your lifestyle.

కెన‌డాలోకి డ‌బ్ల్యూటీఐటీసీ స్కై సోర‌ర్ అరంగేట్రం

0 12

కెన‌డాలోకి డ‌బ్ల్యూటీఐటీసీ స్కై సోర‌ర్ అరంగేట్రం

కెన‌డా, మే 28G  అంత‌ర్జాతీయంగా ప్ర‌పంచ‌ తెలుగు సమాచార సాంకేతిక మండలి (WTITC) వేగంగా విస్త‌రిస్తోంది. అగ్ర‌రాజ్యం అమెరికా రాజ‌ధాని వాషింగ్ట‌న్ డీసీ లో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కృతం అయిన ‘డ‌బ్ల్యూటీఐటీసీ స్కై సోర‌ర్` కెనడా దేశానికి చేరింది. వర‌ల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ యొక్క కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేసే క్ర‌మంలో వివిధ దేశాల్లో ప‌ర్య‌టిస్తున్న WTITC చైర్మ‌న్ సందీప్ మ‌ఖ్త‌ల నేడు కెన‌డా రాజ‌ధాని టోరంటోలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్ తో క‌లిసి ప్ర‌పంచ‌ తెలుగు సమాచార సాంకేతిక మండలి యొక్క స్కై సోర‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ డైరెక్ట‌ర్ విష్ణు రెడ్డి మరియు ఐటీ రంగ ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

కెన‌డాలో ప్ర‌పంచ‌ తెలుగు సమాచార సాంకేతిక మండలి కార్య‌క్ర‌మాల‌ను విస్తృతం చేసే క్ర‌మంలో భాగంగా WTITC చైర్మ‌న్ ఆ దేశంలో ప్ర‌స్తుతం ప‌ర్య‌టిస్తున్నారు. కెన‌డా రాజ‌ధాని టోరంటోలో ఐటీ రంగ ప్ర‌ముఖులు ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో సందీప్ మ‌ఖ్త‌లతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్ సైతం పాల్గొన్నారు. WTITC యొక్క మీట్ ఆండ్‌ గ్రీట్ కార్య‌క్ర‌మంలో జ‌యేశ్ రంజ‌న్ మాట్లాడుతూ సందీప్ మ‌ఖ్త‌ల నాయ‌క‌త్వంలో చేప‌డుతున్న WTITC కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా వాషింగ్ట‌న్ డీసీలో మంత్రి కేటీఆర్ చేత ప్రారంభించ‌బ‌డిన స్కై సోర‌ర్ ను ఐటీ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌ ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఐటీ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్ మాట్లాడుతూ, తెలంగాణలో ఐటీ ప‌రిశ్ర‌మ అభివృద్ధిలో సందీప్ క్రియాశీల‌క పాత్ర పోషించార‌ని ప్ర‌శంసించారు. ప్ర‌భుత్వానికి ఐటీ ప‌రిశ్ర‌మ‌కు, ఐటీ ఉద్యోగులకు వార‌ధిగా ఆయ‌న నిలిచార‌ని గుర్తు చేశారు. ప్ర‌పంచ‌ తెలుగు సమాచార సాంకేతిక మండలి రూపంలో సందీప్ చేస్తున్న ప్ర‌య‌త్నం విజ‌య‌వంతం అవుతుంద‌ని పేర్కొన్నారు. కెన‌డాలోని వ్యాపార‌వేత్త‌ల‌కు, ఎంట్ర‌ప్రెన్యూర్ల‌కు తెలంగాణ పాల‌సీలను ఈ సంద‌ర్భంగా జ‌యేశ్ రంజ‌న్‌ వివ‌రించారు. కెన‌డాకు చెందిన బృందం తెలంగాణ‌లో ప‌ర్య‌టించాల‌ని, టైర్ 2, టైర్ 3 న‌గ‌రాల‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని, ఇందుకు సందీప్ మ‌ఖ్త‌ల స‌మ‌న్వ‌యం వ‌హించాల‌ని అన్నారు.

ఈ సంర్భంగా ప్ర‌పంచ‌ తెలుగు సమాచార సాంకేతిక మండలి చైర్మ‌న్ సందీప్ మ‌ఖ్త‌ల మాట్లాడుతూ, త‌మ మీట్ ఆండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నందుకు ద‌న్య‌వాదాలు తెలిపారు. తన నాయ‌క‌త్వం ప‌ట్ల ఉంచిన విశ్వాసం, WTITCకి స‌హాయం అందించేందుకు ముందుకు రావ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఆగ‌స్టు 5, 6 తేదీల్లో చాంగి సింగ‌పూర్ ఎక్స్‌పోలో ప్రపంచ తెలుగు ఐటీ మహాసభ నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు సందీప్ మ‌ఖ్త‌ల తెలిపారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లో ఐటీ ప‌రిశ్ర‌మ నిపుణులు, పెట్టుబ‌డిదారులు, ఆవిష్క‌ర్త‌లు, స్టార్ట‌ప్‌లు పాల్గొన‌బోతున్నార‌ని వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని కెన‌డాలోని బృందానికి సూచించారు.

ఈ మీట్ ఆండ్ గ్రీట్‌, స్కై సోర‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లో, న‌రేష్‌, స‌న్నీ చారీ, రోణిత్ బండ‌, అనిల్‌, తాళ్ల రాహుల్‌, న‌వీన్‌, రాజు చామ‌ర్తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking