Take a fresh look at your lifestyle.

బడా పారిశ్రమీక వేత్తలకు దొచి పెడుతున్న ప్రధాని మోడీ

0 16

దేశ సంపదను బడా పారిశ్రమీక వేత్తలకు

దొచి పెడుతున్న ప్రధాని మోడీ

: సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి

జగిత్యాల. ఏప్రిల్ 27 : భారతదేశ సంపదను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బడా పారిశ్రామిక వేత్తలకు ధోచిపెడుతున్నాడని ఇందుర్తి మాజీ శాసన సభ్యులు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా బీజేపీ హటావో… దేశ్ కి బచావో అనే నినాదంపై పల్లె పల్లెకు సిపిఐ.. ప్రజల వద్దకు సిపిఐ జన చైతన్య యాత్ర బుధవారం జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి, వెల్గటూర్ తోపాటు ధర్మారం మండలాల్లో 4 వ రోజు కొనసాగగా చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

ఈసంధర్బంగా గొల్లపల్లి, వెల్గటూర్ సభల్లో వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల తెలుసుకోవడం కోసం సిపిఐ నాయకులు గ్రామాలకు వెళ్లి ప్రజలను చైతన్యవంతం చేస్తామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులపై నల్ల చట్టాలను ప్రయోగించి అనేక ఇబ్బందులకు గురించేసిందని విమర్శిస్తూనే కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడూలుగా విభజించి పెట్టుబడి దారులకు అనుకూలంగా మలిచిందన్నారు.నిరుద్యోగులకు కోటి ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను కేంద్రం పెంచి పేద ప్రజలపై పెనుబారం మోపిందని మండిపడ్డారు.నిత్యావసర వస్తువుల ధరలను పెంచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను మరింత పేదరికంలోకి నెత్తివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు పల్లెల్లో ఉపాధి కల్పిస్తున్న
ఉపాధి హామీ పథకానికి కేంద్రం నిధులు బడ్జెట్ లో తగ్గించి పథకాన్ని ఎత్తివేసే కుట్రకు బీజేపీ పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి అన్నీ వర్గాలను మభ్యపెడుతుందని వెంకట్ రెడ్డి దుయ్యబట్టారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఏమయిందని ప్రశ్నించారు. అర్హులైన వారందరికీ కొత్తగా అన్నీ రకాల పింఛన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడు రూమ్ ఇళ్ళు, దళితబందు అందించాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking