Take a fresh look at your lifestyle.

ఓట్లు మావి… సీట్లు మీవా..? ఇంకెంత కాలం అగ్రవర్ణాల పెత్తనం

0 16

బహుజనులు సిగ్గు పడాలి..

  • ఓట్లను నోట్లకు అమ్ముతారు
  • అగ్రవర్ణాలకు గులాం గిరి చేస్తారు
  • 10 శాతం లేనోళ్లు 62 గురు ఎమ్మెల్యేలు
  • 90 శాతం ఉన్నోళ్లు 57 గురు ఎమ్మెల్యేలు
  • అగ్ర వర్ణాలకే రాజ్యాధికారం
  • మొన్న ముఖ్యమంత్రి వెలమ.. యేడు రెడ్డియే..

‘‘ఓట్లు మావి… సీట్లు మీవా..? ఇంకెంత కాలం అగ్రవర్ణాల పెత్తనం..’’ చదువడానికి బాగానే ఉండచ్చు.. మెజార్టీ ప్రజలు నిజమే అనచ్చు.. కానీ.. ఆచరణలో జరిగేది ఏమిటి..? బహుజనులు పిచ్చోళ్లు.. ఓట్లను నోట్లకు అమ్ముతారు. అందుకే అగ్రవర్ణాలు డబ్బులు ఇచ్చి ఓట్లు కొని గద్దె నెక్కుతారు. ఆ తరువాత వాళ్లు రాజ్యాధికారం అనుభవిస్తారు.

ఇగో.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే బహుజన విద్యావంతులు పడుతున్న బాధ వర్ణతీతం. బహుజనుల రాజ్యాధికారం వస్తే మన బతుకులు మారుతాయని అన్నీ తెలిసినా ( బీఎస్పీ నేత డాక్టర్ ప్రవీణ్ కుమార్) బహుజన నేతలు ఆవేశంగా స్పీచ్ లు ఇస్తే నిజమే కదా అని జోష్ గా చప్పట్లు కొడుతారు. ఆ తరువాత (బహుజనులు) మనోళ్లు ఎన్నికల్లో పోటీ చేస్తే తరతరాలుగా పెత్తనం చేస్తున్న అగ్రవర్ణాలకు మాత్రమే ఓటు వేసి గెలిపిత్తారు.

అగ్రవర్ణాలకు రాజ్యాధికారం..

మొత్తం తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఐదు శాతం లేనోళ్లు 62 మంది ఎమ్మెల్యే సీట్లు గెలిచారు. రెడ్డిలు 43 మంది, వెలమలు 13 మంది, కమ్మ కులం నుంచి నలుగురు, బ్రహ్మాణ, వైశ్యుల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఐదు శాతం లేని జనాభ నుంచి 62 గురు ఎమ్మెల్యేలు శాసన సభలో అడుగు పెడుతున్నారు. 60శాతం ఉన్న బీసీలు 19  గురు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి వర్గాలకు చెందిన వారు 38 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అయినా.. అగ్రవర్ణాలకే రాజ్యాధికారం..  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 90 శాతం జనం ఉన్న బహుజనులు మాత్రం  అగ్రవర్ణాలకు ’’బాంచెన్ కాల్మోక్తా దొరా..’’ అంటూ వాళ్ల వద్ద పనోళ్లలాగా పడి ఉంటున్నారు. మొన్నటి వరకు వెలమ సామాజిక వర్గం నుంచి కే. చంద్రశేఖర్ ముఖ్యమంత్రి… మంత్రి మండలిలో అగ్రవర్ణాలదే పెత్తనం.. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రెడ్డి సామాజిక వర్గం నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్ర అయ్యారు. అతని క్యాబినెట్ లో మెజార్టీ రెడ్డిలే ఉంటారు. అన్నీ తెలిసి కూడా బహుజనులు అగ్రవర్ణాలకు అమ్ముడు పోతున్నందుకు సిగ్గు పడాల్సిందే..

బహుజన వాదం గెలిస్తే ఆత్మగౌరవంతో..

ఔను…బహుజన వాదం ఓడిపోయింది. బహుజన రాజ్యాధికారం కోసం పని చేస్తున్న ప్రజాప్రతినిధులను అసెంబ్లీ ఎన్నికలలో బహుజనులే తమను తామే ఓడించుకున్నారు. అగ్రవర్ణాల మోచేతి నీళ్లు తాగడానికి అలవాటు నుంచి ఎప్పుడు విముక్తి అవుతారోనని బహుజన విద్యావేత్తలు నిరిక్షీస్తున్నారు.

బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బాధ్యతలు తీసుకున్న తరువాత బహుజన వాదంను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రాత్రింబగళ్లు కష్ట పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా జనాభ అదారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు బీఎస్సీ సీట్లు కెటాయించింది.  డాక్టర్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. అయినా.. బహుజనులే అతనిని ఓడించారు.

బహుశా బీఎస్పీ తరుపున ప్రవీణ్ కుమార్ ఒక్కడు గెలిచినా ఎంతో మేలు జరిగేది. మరి బహుజనులు ఎందుకు ఇట్లా అగ్రవర్ణాలకు అమ్ముడు పోతున్నారో ఆలోచించాలి. ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్నతమైన భవిష్యత్ ను వదిలి బహుజనుల రాజ్యం కోసం అతను రాత్రింబగళ్లు కష్ట పడ్డారు. బహుజన వాదం గెలిస్తే రాజ్యాధికారంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలందరూ భాగస్వాములవుతారని,ఆత్మగౌరవంతో జీవిస్తారని ఎంతగానో ఆశపడ్డారు ప్రవీణ్ కుమార్. అయినా..  బహుజనులు మారలేరు.. అగ్రవర్ణాలకు ఓట్లు వేసి వారిని గెలిపించడం నిజంగా బ్యాడ్ లక్..

రాబోయే కాలంలోనైనా బహుజనులు మారుతారని ఆశిద్దాం..

బహుజన రాజ్యాధికారం కోసం మన బిడ్డలను ప్రజాప్రతినిధులుగా చూసే రోజులు రావాలని కోరుకుందాం..

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking