Take a fresh look at your lifestyle.

పిల్లిని ఎత్తుకుపోయిన దొంగ..

0 333

దొంగ.. వాడికి విలువైన వస్తువు ఏది కనిపించినా దొంగతనం చేయడమే వాడి పని. ఇగో.. హైదరాబాద్ నగరంలో దొంగకు పిల్లి కనిపించింది. ఆ పిల్లి అందంగా ఉంది. ఒకవేళ ఆ పిల్లిని విక్రయిస్తే కూడా బాగానే డబ్బులు వస్తాయనుకున్నాడెమో.. టూ వీల్లర్ పై వచ్చాడు. ఆ పిల్లిని దొంగిలించుకుని పారి పోయాడు.

ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లా తిరిగే ఆ పిల్లి కనిపించక పోవడంతో సీసీ కెమెరాలను పరిశీలించారు. అంతే.. ఆ పిల్లిని దొంగ ఎత్తు కెళ్లాడని తెలుసుకుని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు పిల్లిని ఎత్తుకెళ్లిన దొంగ కోసం గాలిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగ ఎక్కడి నుంచి వచ్చాడో.. ఎక్కడికి వెళ్లాడో వెతుకుతున్నారు.

ఇంతకు ఆ పిల్లి  ఎవరిదో చెప్పలేదు కదూ.. వనస్థలిపురం పరిధిలోని జహంగీర్ కాలనీలో షేక్ అజహర్ మహమూద్ అనే వ్యక్తిది . 50 వేలకు ఆ పిల్లిని కొనుగోలు చేశారు ఆయన.. అరుదైన ఆ పిల్లిని ఇంట్లో మెంబర్ లా ఆలానా పాలనా అన్నీ చూసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.

ముద్దుగా ఆ పిల్లికి ‘‘నోమాని’’ పేరు పెట్టుకున్నారు. 18 నెలల వయసు ఉన్న ఆ పిల్లి కళ్లు వింతగా ఉంటాయట. ఒక కన్ను బ్లూ.. మరో కన్ను బ్లూ ఉంటాయట.

 పిల్లిని ఎత్తుకుపోయారంటూ మహమూద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే ఆ పిల్లిని దొంగ నుంచి స్వాధీనం చేసుకుని దాని యజమానికి ఇచ్చారు వనస్థలి పురం పోలీసులు.

– మారబోయిన మాన్విక్ రుద్ర

 

Leave A Reply

Your email address will not be published.

Breaking