Take a fresh look at your lifestyle.

స్నాతకోత్సవ ఆహ్వాన పత్రిక లో అధికార పార్టీ రంగులు సరికాదు, ఏఐఎస్ఎఫ్

0 64

స్నాతకోత్సవ ఆహ్వాన పత్రిక లో అధికార పార్టీ రంగులు సరికాదు, ఏఐఎస్ఎఫ్
(అనంతపురము జిల్లా,సిటీ)
శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో ఈనెల 24వ తేదీన జరిగేటువంటి స్నాతకోత్సవం కార్యక్రమం ఆహ్వాన పత్రిక లో అధికార పార్టీ యొక్క జండా రంగులను ఆహ్వాన పత్రికలో ముద్రించడాన్ని ఏఐఎస్ఎఫ్ వ్యతిరేకిస్తూ గురువారం నాడు ఎస్కేయూలో నిరసన వ్యక్తం చేసి విసి గారిని కలిసి వివరణ కోరడం జరిగింది, ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాన్సన్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ స్నాతకోత్సవం కార్యక్రమం ఆహ్వాన పత్రిక లో అధికార వైసిపి పార్టీ జెండా రంగులను ముద్రించడాన్ని తీవ్రంగా ఖండించారు, విశ్వవిద్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల అభిమానులు మరియు అన్ని సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు ఉంటారని సమానమైన టువంటి పరిపాలన కొనసాగించే విధంగా ఎస్ కే యు పాలకవర్గం నిర్ణయాలు తీసుకోవాలి తప్ప అధికార పార్టీ మెప్పుకోసం పార్టీ యొక్క రంగులను యూనివర్సిటీ యొక్క అధికారక కార్యక్రమాలలో పులమటము చాలా బాధాకరమన్నారు, అంతగా అధికార పార్టీ మీద ప్రేమ ఉంటే తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి పార్టీలో కొనసాగి పార్టీకి సేవలు కొనసాగించుకోవచ్చని తెలిపారు, ఎంతో చరిత్ర కలిగిన శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో రాజకీయ చదరంగాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు, ఇలాంటి కార్యక్రమాలను అడ్డగించాలని ఆలోచన ఉన్నప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని అడ్డగించే కార్యక్రమాన్ని విరమించుకున్నమని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే కచ్చితంగా ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు, ఆహ్వాన పత్రికల విషయం గురించి విసి గారిని వివరణ కోరగా అనుకోకుండా అలా జరిగిందని కావాలనే మేము రంగులు ముద్రించ లేదని మాట దాటివేస్తున్నారని అన్నారు, ఇప్పటికైనా వారు స్వార్ధ ప్రయోజనాలు మాని విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం విద్యార్థుల శ్రేయస్సుకోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు విరు యాదవ్, రమణయ్య, నాయకులు రజనీకాంత్, హుస్సేన్, ఈశ్వర్, రంజిత్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking