Take a fresh look at your lifestyle.

ఆ ఐదుగురు అవినీతి నియంత పోకడాలే ఓటమికి కారణం..

0 23

కేసీఆర్ ఫ్యామిలీ అహంకారమే ఓటమికి కారణం..

–  ఆ ఐదుగురు నియంత పోకడాలు.. అవినీతి ఆరోపణలు

– బెదిరింపులు.. ల్యాండ్ సెటిల్ మెంట్స్..

– జర్నలిస్టులను, ప్రభుత్వ ఉద్యోగులను లెక్క చేయక పోవడం..

– కేసీఆర్ ఫ్యామిలీ మాటల గారడితో మాయ చేస్తారనే టాక్

–  సిట్టింగ్ ఎమ్మెల్యేలను పోటీలో పెట్టడం..

–  బానిస తత్వం కలిగిన ఉన్నతాధికారులకు ముఖ్యమైన పోస్టులు

కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు.. బీఆర్ ఎస్ ఓటమికి సీఎం కేసీఆర్ ఫ్యామిలీ కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ అయిదుగురిపై అవినీతి ఆరోపణలు.. నియంతలా వ్యవహరించడం.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తామే ఓనర్ లం అంటూ తరచు సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ అహంకారంతో వ్యాఖ్యానించడం..  సీఎం కేసీఆర్ సచివాలయంకు రాకుండా ఫాం హౌజ్ లో ఉండటం కూడా కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా సీఎం అంటే దొర అనే దొరణితో పాలన చేయడంతో పాటు ప్రజలు కలిసే అవకాశం ఇవ్వక పోవడం కూడా కారణంగా చెబుతున్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్.. రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఉద్యమించడం.. అందుకోసం యువత ఆత్మహత్య చేసుకోవడంతో సోనియా గాంధీ రాజకీయంగా నష్ట పోయినా ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది. కానీ.. ఆ తెలంగాణ తానే తెచ్చానని రాజకీయంగా లబ్ది పొందడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ ఎస్ పదేళ్ల కాలంలో చాలా తప్పులు చేశారు.

ముఖ్యంగా సీఎం కేసీఆర్, అతని తనయుడు మంత్రి కేటీఆర్, అల్లుడు హరీశ్ రావు, కూతురు కల్వకుంట్ల కవిత, రాజ్యసభ్యుడు సంతోష్ రావులు ఈ ఐదుగురు కేసీఆర్ ఫ్యామిలీ మెంబరులు. రాష్ట్ర పరిపాలన ఈ ఐదుగురి కనుసైగలతోనే కొనసాగింది. ఆ ఐదుగురి నుంచి ఫోన్ వచ్చిందంటే ఎంతటి పనైనా కావాల్సిందే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఈ అయిదుగిరి ఆస్తులు నామ మాత్రమే.. కానీ, ఇప్పుడు ఎవరు ఊహించని స్థాయిలో కోట్లు పెరిగి పోయాయి. అధికారికంగా ఎన్నికల కమీషన్ కు చూపిన లెక్కలతో పోల్చితే మరో పదింతాలు ఎక్కువే ఆస్తులు ఉన్నట్లు ప్రతిపక్షలు ఆరోపణలు చేశాయి.

కేసీఆర్ నియంత పోకడాలే..

పదేళ్లు కేసీఆర్ పాలనను చూసిన ప్రజలు విసికి పోయారు. కుక్కను పోటీలో పెడితే గెలుస్తాందనే అహంకారం అతనిలో కనిపించింది. అప్పుడప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో విలేకరుల నుంచి ప్రశ్నలు వస్తే తట్టుకోలేక ఎదురు దాడి చేసేవారు. ప్రత్యేక తెలంగాణలో జర్నలిస్టులకు ట్రిపుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేస్తానని చెప్పిన అతను ప్లాట్లు కూడా అందరికి ఇవ్వలేక పోయారు. హైదరాబాద్ లో ఇళ్ల స్థలాల పంపిణీ జర్నలిస్టులకు అందని ద్రాక్షలా మారింది. కర్ణుడి చావుకు కారణాలు ఎన్నో అన్నట్లు అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ ఎస్ ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేలుగా గెలువలేక పోయారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం కాంగ్రెస్ పార్టీకి సై అనడానికి కేసీఆర్ నియంతృత్వ పాలనే కారణంగా చెబుతున్నారు.

బానిస తత్వం కలిగిన ఉన్నతాధికారులకు ముఖ్యమైన పోస్టులు

తెలంగాణ పాలన విధానంలో సీఎం కేసీఆర్ తనకు బానిసగా ఉండే ఉన్నతాధికారులకు ముఖ్యమైన పోస్ట్ లలో నియమించారు. బానిస తత్వం కలిగిన ఉన్నతాధికారులను చెప్పు చేతుల్లో ఉంచుకున్నారు. నిక్కచ్చిగా, నిజాయితీగా పని చేసే అధికారులను అణచడం మరో కారణంగా చెబుతున్నారు. అయితే… ఉద్యోగులను కూడా బానిసల్లా చూడటం వల్ల నేడు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వేశారు. అలాగే పోలీసు అధికారులను సైతం మంత్రి కేటీఆర్ దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులను తమ గుప్పిట్లో పెట్టుకుని రాజ్యసభ సభ్యుడు రియల్ వ్యాపారంలో కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. నిజాయితీగా పని చేసే పోలీసు అధికారులకు నామ మాత్రం పోస్టింగ్ లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking