Take a fresh look at your lifestyle.

విద్యుత్ ఉద్యోగుల నిరసన సెగలు

0 42

వేతన సవరణ వెంటనే అమలు చేయాలి

8వ రోజు కు చేరుకున్న

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల నిరసన సెగలు

హైదరాబాద్ మార్చ్ 4 : 2022 నుండి పెండింగ్ లో ఉన్న పిఆర్సి మరియు 2004 వరకు విధులలో ఉన్న ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఈపిఎఫ్ టూ జిపిఎఫ్ అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐకాసా పిలుపుమేరకు శనివారం టిఎస్పిఇజేఏసి హబ్సిగూడ సర్కిల్ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు కార్మికులు వారి డిమాండ్ల సాధనకు మధ్యాహ్నపు విరామ సమయంలో హబ్సిగూడ సర్కిల్, ఉప్పల్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు జరిపారు.

పెండింగ్ లో ఉన్న పిఆర్సి ని పాత పెన్షన్ స్కీంను వెంటనే అమలు చేయాలని, ఆర్టిజన్లకి ఏపిఎస్ఇబి సర్వీస్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలని, విద్యార్హతలను బట్టి వాళ్లకి పదోన్నతులు కల్పించాలని పర్సనల్ పే ను సర్వీస్ పే లో కలిపిన తర్వాతే పే ఫిక్సేషన్ చెయ్యాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో హబ్సిగూడ సర్కిల్ ఎస్ఇ శ్రీ రాముడు ,డిఇటి.ఎం.సూర్యనారాయణ, చైర్మన్ మంద.నిరంజన్ రెడ్డి, కో. చైర్మన్ ఎండి. జహంగీర్, కన్వీనర్ రాజశేఖర్ , కో కన్వీనర్ సాంబశివరావు, డిఇ ఎస్,ఏడిఇ,ఎస్,ఏఇఎస్ మరియు ఇతర నాయకులు, కళ్యాణి ఏఇ, డిజే వేణుగోపాల్ ,ఎల్.వెంకటేష్ , భూక్యా .శ్రీనివాస్ నాయక్ తదితర కార్మిక నాయకులు, ఉద్యోగులు టిఎస్పిఇజేఏసి- హబ్సిగూడ సర్కిల్ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking